ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా ఒక విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే రంజి క్రికెటర్ అయిన సర్ఫరాజె ఖాన్ కు భారత జట్టు నుంచి పిలుపు రావడమె. అయితే గత కొంతకాలం నుంచి ఇతని గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఎంతోమంది యువ ఆటగాళ్ళు దేశవాలి టోర్నీలలో రాణిస్తూ అదరగొడుతూ ఉన్నారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో దాదాపు 3 వేలకు పైగా పరుగులు చేసిన సర్పరాజ్ ఖాన్ విషయంలో మాత్రం సెలెక్టర్లు మొండి పట్టుతోనే ఉన్నారు. టీమిండియాలో ఎప్పుడు చోటు దక్కుతుంది అని అతను ఎన్నో ఏళ్ల నుంచి నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నారు.


 అయితే ఇక ప్రతిసారి కూడా అటు సెలెక్టెర్లు అతని పక్కన పెడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక తన అసంతృప్తిని కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఎట్టకేలకు సర్పరాజ్ ఖాన్ కి టీం ఇండియా నుంచి పిలుపు వచ్చింది. రెండో టెస్టు మ్యాచ్ కోసం టీం ఇండియా సిద్ధమవుతూ ఉండగా.. జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే సర్పరాజ్ ఖాన్ కు జట్టులో అవకాశం కల్పించారు సెలెక్టర్లు. దీంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత అతనికి టీమిండియా నుంచి పిలుపు రావడం పైనే ప్రస్తుతం భారత క్రికెట్లో చర్చ జరుగుతూ ఉంది. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. కాగా భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ సైతం ఈ విషయంపై స్పందించాడు. సర్ఫరాజ్ తో ఉన్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేస్తూ.. బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. పండుగ చేసుకునేందుకు సిద్ధమవ్వు.. సంతోషంగా ఉంది అంటూ సూర్య కుమార్ యాదవ్ ఒక పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. కాగా సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 66 ఇన్నింగ్స్ లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: