పట్టుదల, దృఢమైన సంకల్పం ముందు ఎంతటి కఠినమైన సవాలునైనా ఎదురుకోవచ్చు  అని చెబుతూ ఉంటారు నిపుణులు. అయితే కొంతమంది సాధించిన విజయాలను చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఇటీవల సర్పరాజ్ ఖాన్ కు టీమ్ ఇండియాలో చోటు దక్కడం కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. టీమిండియాలో చోటు దక్కడం అనేది సర్వసాధారణమైన విషయమే. ఇటీవల కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు భారత జట్టులో చోటు సంపాదించుకుంటున్నారు.


 ఐపీఎల్ సహా దేశ వాలి టోర్నీలలో సత్తా చాటుతూ ఇరగదీస్తున్నారు. ఒకటి రెండు మ్యాచ్లలో ఎవరైనా ఆటగాడు బాగా రాణించాడు అంటే చాలు సెలెక్టర్లు అతన్ని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇలా గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో యువ ఆటగాళ్లదే హవా నడుస్తుంది. కానీ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో ఉంది. అతను ఎవరు చేయలేనన్ని పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చేశాడు. కానీ సెలెక్టర్లు మాత్రం అతని విషయంలో కనికరం చూపించలేదు. ప్రతిసారి కూడా అతని పక్కన పెడుతూనే వచ్చారు. దీంతో సెలెక్టర్ల తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. ఉద్దేశపూర్వకంగానే సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ ను అటు భారత జట్టుకు సెలెక్ట్ చేయడం లేదు అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా అసహనం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత జట్టులో చోటు కోసం ఎన్నో రోజుల నుంచి నిరీక్షణగా ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కల నెరవేరుతుంది. ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ కోసం భారత జట్టు నుంచి అతనికి పిలుపు అందింది. కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజాలు గాయం బారిన పడటంతో సర్ఫరాజ్ కు అవకాశం కల్పించారు సెలెక్టర్లు  అయితే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత చివరికి ఈ టాలెంటెడ్ ప్లేయర్ కి టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కడంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల నిరీక్షణకు చివరికి ఫలితం దక్కిందని ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: