ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. (ఐపీఎల్) టీం ఓనర్స్ కూడా తమ జట్టులో మంచి ప్రతిభ కలిగిన విదేశీ ఆటగాళ్లు ఉండాలి అని ముందు నుండే అనుకుంటూ ఉంటారు. దానితో విదేశీ ఆటగాళ్లను భారీ మొత్తంలో ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు. దానితో విదేశీ ఆటగాళ్లు కూడా (ఐపీఎల్) లో ఆడేందుకు ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఇకపోతే తమ జాతీయ టీమ్ లకి ఆడడం కంటే కూడా (ఐపీఎల్) లో ఆడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆటగాళ్లు కూడా ఉన్నారు.

ఇకపోతే మరోసారి ఇది నిరూపితమైంది. మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ కి మధ్య "టి 20" సిరీస్ జరగబోతుంది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుకు సంబంధించిన ఎనిమిది మంది టాప్ ప్లేయర్ లు (ఐపీఎల్) ఆడుతున్నారు. దానితో ఈ ఎనిమిది మంది టాప్ ప్లేయర్స్ పాకిస్తాన్ తో జరిగే "టీ 20" సిరీస్ కు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దానితో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ఈ పాకిస్తాన్ "టీ 20" సిరీస్ కోసం ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారితోనే పాకిస్తాన్ తో "టీ 20" సిరీస్ ను న్యూజిలాండ్ బోర్డు ఆడించబోతున్నట్లు తెలుస్తోంది.  

ఇక ప్రస్తుతం జరుగుతున్న (ఐపీఎల్) లో న్యూజిలాండ్ జట్టుకు సంబంధించిన విలియమ్స్ ,  బౌల్ట్ , ఫెర్గుసన్ , హెన్రీ , డారిల్ , మిచెల్ , రచిన్ , సంట్నార్ , ఫిలిప్స్ ఈ ఎనిమిది మంది ఆటగాళ్లు ఆడుతున్నారు. ఇక న్యూజిలాండ్ జట్టుకు సంబంధించిన ఈ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ కు జరగనున్న "టీ 20" సిరీస్ కు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl