వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులుగా  కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే అటు పాకిస్తాన్, ఇండియా పేర్లను చెబుతూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య కేవలం సరిహద్దుల్లోనే కాదు అటు క్రికెట్లో కూడా వైరం కొనసాగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన అది హై వోల్టేజ్ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలో మాత్రమే అటు పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇరు జట్లు ఒక దేశ పర్యటనకు మరో జట్టు వెళ్లడం అసలు కుదరదు. అంతేకాకుండా ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగవు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ తలబడుతూ ఉంటాయి. అయితే మళ్ళీ ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్తాన్, ఇండియా మధ్య ద్వైపాక సిరీస్ జరిగితే బాగుంటుందని ఎంతోమంది పాకిస్తాన్ మాజీలు ఇప్పటివరకు అభిప్రాయం వ్యక్తం చేశారు.


 అయితే ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్, భారత్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడితే బాగుంటుందని.. రోహిత్ శర్మ అన్నాడు. అయితే రోహిత్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. రెండు దేశాల మధ్య సిరీస్ గురించి రోహిత్ చాలా మంచి అభిప్రాయాన్ని చెప్పారు. ఈ దేశాల విషయంలో క్రికెట్ ది కీలకపాత్ర. మ్యాచ్ లు జరిగితే బంధం మెరుగవుతుంది. చక్కటి బంధం మన హక్కు అంటూ ఆఫ్రిది కామెంట్ చేశాడు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు 16 ఏళ్ల క్రితం సీరిస్ లు జరిగాయి. ఇక ఆ తర్వాత క్రికెట్ సంబందాలపై భారత ప్రభుత్వం నిషేధం కొనసాగిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: