సాధారణంగా క్రికెట్లో కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచే ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయ్. ఏకంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్లను ఒడిసిపెట్టడం లాంటిది జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటివి ఏదైనా జరిగింది అంటే చాలు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే గతంలో క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అని అనేవారు క్రికెట్ నిపుణులు. కానీ ప్రస్తుతం చూస్తుంటే క్యాచెస్ విన్స్ ఫ్యాన్స్ హార్ట్స్  అనే మాట కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే అద్భుతమైన క్యాచ్ లతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నారు ఎంతో మంది క్రికెటర్లు.


 ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన క్యాచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఇది చూసి ఆ వీడియోలో క్యాచ్ పట్టిన ఆటగాడు పక్షిరాజు అయ్యుండవచ్చు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్. అభిషేక్ దాస్ అనే ఆటగాడు అందుకున్న ఆ క్యాచ్ దిగ్గజ ఆటగాళ్లను గుర్తుచేస్తుంది. బౌండరీ లైన్ వద్ద అభిషేక్ దాస్ చేసిన ఫీల్డింగ్ విన్యాసం క్రికెట్ అభిమానులు అందరిని కూడా కట్టిపడేస్తుంది. దీంతో ఈ వీడియో చూసిన నేటిజన్స్ అందరూ కూడా ఇదేక్కడి మాస్ క్యాచ్ రా మామ ఇలా పట్టేసాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.


 బెంగాల్ ప్రో టి20 లీగ్ లో భాగంగా రేష్మి మెదిని పూర్ వర్సెస్ అడమస్ హౌరా వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనే ఈ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా 19వ ఓవర్లో దీపక్ మెహతా కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ సిక్సర్ గా దూసుకువెళ్ళింది. కానీ అక్కడే బౌండరీ లైన్ వద్ద ఫీలింగ్ చేస్తున్న అభిషేక్ దాస్ సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి సింగల్ హ్యాండ్ తో క్యాచ్ అందుకున్నాడు. ఈ టర్నింగ్ క్యాష్ తో ఈడెన్ గార్డెన్స్ మైదానంలోని అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం లో మునిగిపోయారు. ఇక ఆ తర్వాత అతను పట్టిన క్యాచ్ రీప్లేలో చూసి ఏకంగా తెగ సంబరపడిపోయారు అని చెప్పాలి. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: