ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఇప్ప‌టికే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ వార్ ఎఫెక్ట్ పాకిస్తాన్‌లో అన్ని రంగాల‌పై తీవ్రంగా ప‌డింది. ఇప్ప‌టికే భారత మిసైల్ దాడులతో అక్కడి పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా నిలిచిపోయింది. ఇది పాక్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఎదురు దెబ్బ అనుకునేలోగానే ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో నిర్వ‌హించాల‌ని పాక్ అనుకుంది. అయితే ఈ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. పాక్ సూప‌ర్ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో మ్యాచులు నిర్వహించుకునేందుకు పాక్ చేసిన విజ్ఞప్తిని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తిర‌స్క‌రించాల‌ని  నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, మిగిలిన పీఎస్‌ఎల్ మ్యాచులు యూఏఈలో జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించడం విచిత్రం అనుకోవాలి.


ఇక భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ భద్రతాపరమైన అంశాలకు సంబంధించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు గా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక యూఏఈ బోర్డు త‌మ పీసీఎల్ మ్యాచులకు అనుమతిస్తే ఎమిరేట్స్ బోర్డును పీసీబీకి మిత్రుడిగా భావించే అవకాశం ఉందన్న అంచనాకు వ‌చ్చింద‌ట‌. ఇప్ప‌టికే భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ద్వైపాక్షిక సీరిస్ లు జ‌ర‌గ‌డం లేదు. ఐసీసీ క్రికెట్ టోర్న‌మెంటు ల‌లో త‌ప్ప‌ని స‌రిగా త‌ల‌ప‌డాల్సి వ‌స్తే మాత్రం త‌ట‌స్థ వేదిక‌ల మీదే జ‌రుగుతున్నాయి. ఇప్పుడు వార్ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌రిగే ఆసియా క‌ప్ ఉంటుందా ?  ఉండ‌దా ? అన్న సందేహాలు ఉన్నాయి. ఒక వేళ ఆసియా క‌ప్ జ‌రిగినా భార‌త్ - పాక్ మ్యాచ్ క‌చ్చితంగా త‌ట‌స్థ వేదిక‌ల మీదే ఉండొచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: