ఇండియాలో 5జీ నెట్‌వ‌ర్క్ సర్వీస్ లు స్టార్ట్ అవుతున్న వేళ‌. ఇండియా మార్కెట్లో 5జీ మొబైల్స్ లాంచ్ చేయ‌డానికి కంపెనీలు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొత్త 5జి ఫోన్‌లు లాంచ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా జూన్ నెల‌లో టెక్ మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్లు సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. మ‌రి ఈ నెల‌లో రాబోతున్న ఫోన్‌లు ఏంటీ.? వాటి ఫీచ‌ర్లు ఏంట‌న్న దాని గురించి మీరు తెలుసుకోండి.


One Plus బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం యూత్ ని బాగా ఆకట్టుకుంటున్న స్మార్ట్ ఫోన్. ఈ బ్రాండ్ నుంచి One Plus Nord అనే మోడల్ రాబోతుంది.అందుకే ఈ బ్రాండ్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 10న విడుద‌ల కావడానికి రెడీగా వుంది. ఈ 5 జి స్మార్ట్ ఫోన్లు జూన్ 11 నుంచి వినియోగ‌దారుల కోసం ప్రీ-ఆర్డ‌ర్ అందుబాటులో ఉండ‌నున్నాయి. ఇక ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. ఈ ఫోన్‌లో 90 హెడ్జ్ డిస్‌ప్లే, స్నాప్ గ్రాగ‌న్ 750జి ప్రాపెస‌ర్‌, 64 మెగా పిక్సెల్ రియ‌ర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమ‌రా దీని ప్ర‌త్యేక‌త‌లు.


ఇంకా అలాగే samsung కూడా ఎప్పటినుంచో మార్కెట్ లో మంచి క్రేజ్ వున్న బ్రాండ్ అనే చెప్పాలి. ఈ ప్ర‌ముఖ మొబైల్ కంపెనీ సామ్‌సంగ్ ఈ నెల‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసే అవ‌కాశాలున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్ రూ. 16000 ఉండనుంది (అంచ‌నా). ఈ ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. 6.4 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ ప్రాసెసర్, 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్ కి ఉంటుంది.


ఇక xiaomi నుంచి xiaomi 11 Pro కర్వ్ ఎడ్జ్ డిస్‌ప్లేతో కూడిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే నెలలో రానుంది. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో రానున్న ఈ ఫోన్ ధ‌ర రూ. 60 వేల వ‌ర‌కు ఉండే అవ‌కాశాలున్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 888 సోసి ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ మొబైల్ కి ఉంటుంది.


ఇక బడ్జెట్ ఫోన్ కావాలనుకునే మధ్య తరగతి ప్రేక్షకులకు త‌క్కువ ధ‌ర‌లో 5జీ వెర్ష‌న్ విభాగంలో రెడ్‌మి కె 40 5జీ ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఈ మొబైల్ ధ‌ర రూ. 25000 వ‌ర‌కు ఉండొచ్చ‌ని ఓ అంచ‌నా. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్, 48 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఫీచ‌ర్‌ను అందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: