స్టార్ మ్యూజిక్ షో లో ఇటీవల వదినమ్మ సీరియల్ టీం పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో ప్రభాకర్ పెళ్లి ఫోటో ప్రదర్శన జరిగింది. ఇక ప్రభాకర్ పెళ్లి ఎలా జరిగిందంటే , ప్రభాకర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాల వారికి వీరి ప్రేమ గురించి తెలుసు కానీ ఎవరికీ తెలియకుండానే వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సుమ ,రాజీవ్ కనకాల సాక్షులుగా వ్యవహరించారు. ఈ ఫోటో ని చూపిస్తూ ప్రభాకర్ ది దొంగ పెళ్లి అంటూ కామెంట్ చేశారు సుమ. దాంతో మీది దొంగ పెళ్లినా అంటూ సుమను సుజిత ప్రశ్నించింది .అయితే మాది దొంగ ప్రేమ. దొంగ పెళ్లి కాదు అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు సుమ..