ఇంటర్నెట్ డెస్క్: బిగ్ బాస్-4 స్టార్ కంటెస్టెంట్‌ మోనల్‌కు స్టార్ మా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. త్వరలో మొదలు కాబోతున్న ఓ డాన్స్ షోకు హోస్ట్‌గా ఎంపిక చేసింది. దీంతో మోనాల్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ షో కూడా మరొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఎప్పుడెప్పుడు మోనాల్‌ను మళ్లీ చూస్తామా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

బిగ్‌బాస్‌లోకి రాకముందు మోనల్.. కొన్ని టాలీవుడ్ చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ మాత్రం ఆమెకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. హౌజ్ నుంచి బయటకు రావడం ఆలస్యం.. అనేక చోట్ల నుంచి అవకాశాలనూ తెచ్చిపెడుతోంది. కొన్ని షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా ఆమెకు దక్కుతున్నాయట. ఈ క్రమంలోనే స్టార్ మా యాజమాన్యం కూడా మోనల్ హోస్ట్‌గా ఓ షో ప్రారంభించేసింది.

‘డ్యాన్స్ ప్ల‌స్’ పేరుతో రేపటి నుంచి స్టార్ మా ఓ డాన్స్ షోను ప్రారంభించబోతోంది. ఈ షోకు మోనాల్‌ను హోస్ట్‌గా తీసుకుందట. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను కూడా ఈ రోజు విడుదల చేసింది స్టార్ మా.

మరొక్క రోజులో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘వ‌న్ డే టు గో’ అంటూ మోనాల్ తళుక్కుమంది. అయితే ఈ షోలో మోనాల్ హోస్ట్ కాదని, జ‌డ్జి అని కూడా కొన్ని రూమర్లు ఉన్నాయి. ఇక ఈ షోకి మోనాల్‌తో పాటు బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్, య‌శ్ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్‌లు కూడా జడ్జిలుగా ఉంటారట. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోలలకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. మరి ప్రోమోలానే షో కూడా అదరగొడుతుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షోలో మోనాల్‌ గజ్జర్‌, అభిజిత్‌, అఖిల్‌ల మధ్య నడిచిన ట్రయాంగిల్ స్టోరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కొందరైతే అఖిల్, మోనల్ నిజంగానే ప్రేమలో ఉన్నారని, షో అయిపోగానే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని భావించారు. అయితే ఈ వార్తలను ఇద్దరి కుటుంబ సభ్యులూ ఖండించారు. ఇక షో ముగిసిన తరువాత వీరిద్దరూ ఎవరి దారిలో వారు తమ కెరీర్‌లపై దృష్టి సారించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: