బిగ్ బాస్ 5 గేమ్ షో... చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అందరికీ ఇట్టే నచ్చేస్తుంది. కొన్ని సార్లు ఇబ్బందికరంగా ఉండడం నిజమే అయినా, ఒక ఎంటర్ టైన్మెంట్ కోసం ఒక గంట చూసేయచ్చు. 19 మంది కంటెస్టెంట్ లతో ఇల్లు కళకళలాడేది. కనీ ఇప్పుడు కనీసం 10 మంది కూడా లేకపోవడంతో చూసేవారికి సంతృప్తిగా లేదు. అయితే వీరి మధ్య నడుస్తున్న గేమ్స్ మాత్రం మంచి కిక్ ను ఇస్తున్నాయి. బిగ్ బాస్ ఎప్పటికప్పుడు వీరి మెంటల్ మరియు ఫీజికల్ స్ట్రెంగ్త్ ను ఛాలెంజ్ చేస్తూ ఇస్తున్న గేమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే కొన్ని సార్లు ఎంత బలమైన ఆటగాడైనా కొన్ని కారణాల వలన గేమ్ ఓడిపోతూ ఉంటాడు. ఇది సహజం, కానీ ఇప్పుడు బిగ్ బాస్ చివరి దశలో ఉంది ప్రతి గేమ్ చాలా ఇంపార్టెంట్.

అందుకే మిగిలిన 9 మంది సభ్యులు ఎంతో కష్టపడి ఆడుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో టైటిల్ గెలిచే అన్ని గుణాలు సన్నీతో ఉన్నాయని బయట లక్షల మంది ప్రజలు భావిస్తున్నారు. అందుకే వరుసగా సన్నీ ఎలిమినేషన్ లోకి వస్తున్నా తమ అమూల్యమైన ఓట్లు వేసి సేవ్ చేస్తూ టైటిల్ కు దగ్గర చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ తో పాటు మంచి స్నేహితులను పొందే అవకాశాన్ని కూడా బిగ్ బాస్ ఇచ్చాడు. అందుకే ఎవరికీ నచ్చిన వారితో వారు కనెక్ట్ అవుతున్నారు. అందులో భాగంగా సన్నీ కూడా మానస్ మరియు కాజల్ లతో బాగా కలిసిపోయాడు. వారికోసం గేమ్ ను అయినా త్యాగం చేసేంతగా మారిపోయాడు. అది మంచిదే కానీ, అవతలి వారు కూడా అదే విదమైన రిలేషన్ పెట్టుకుంటే, కానీ సన్నీకి ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా స్వార్థపూరితమైన ఆలోచనలను కలిగి ఉన్నవారే.

ఎప్పుడు ఏ విధంగా మారుతారో చెప్పలేని పరిస్థితి. అందుకు సాక్ష్యమే నిన్న స్విమ్మింగ్ పూల్ లో మానస్ కు సన్నీకి జరిగిన టాస్క్? వాస్తవంగా ఈ టాస్క్ సిరి చేయాల్సింది. కానీ వేరే కారణాల వలన బిగ్ బాస్ ఎవరైనా చేయొచ్చు అన్నారు. అప్పుడు మానస్ చేయడానికి ఒప్పుకున్నాడు. సన్నీ ఒక కంటెండర్ అయినప్పుడు మానస్ ఎలా ఒప్పుకున్నాడు అనేది ప్రశ్నర్ధకం? మరియు టీ షర్ట్ ల విషయమై చెలరేగిన వివాదంలోనూ మానస్ కానీ కాజల్ కానీ సన్నీకి ఫేవర్ గా మాట్లాడలేదు. ఇవన్నీ చూస్తుంటే సన్నీ జాగ్రత్తగా ఉండకపోతే స్నేహితులే దెబ్బేసే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: