తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు యాంకర్ సుమ. తెలుగు యాంకరింగ్ లో నెంబర్ వన్ ఎవరంటే తమ ఫేవరెట్ ఎవరైనా సుమ పేరు చెప్పాల్సిందే, అంతగా తన యాంకరింగ్ తో బుల్లి తెరను శాసిస్తోంది సుమ కనకాల. తనతో యాంకరింగ్ మొదలుపెట్టిన వారెందరో సైడ్ అయిపోయినా, యంగ్ యాంకర్లు ఎందరు వచ్చినా...మేల్ యాంకర్ అయినా, ఫీమేల్ యాంకర్ అయినా ది బెస్ట్ యాంకర్ అంటే మాత్రం నాటి నుండి నేటి వరకు సుమ కనకాల. ఈమె పేరే ఒక బ్రాండ్, తన వాక్చాతుర్యంతో సమయానుసారంగా పంచులతో నవ్వుల పువ్వులు పూయిస్తుంది. ఇబ్బందికరమైన వాక్యాలు , కించపరిచే పదజాలం ఏమాత్రం ఉపయోగించకుండా పంచ్ వేయడం సుమ స్టైల్.

సీనియర్ హీరో, హీరోయిన్లపై సైతం సరదాగా మాట్లాడుతూ పంచులు వేయాలంటే అందుకు సుమ ఉండాల్సిందే. బుల్లి తెరపై ఎప్పుడూ సుమ కనకాల సీజన్ నడుస్తుంటుంది, ఎప్పుడూ చేతినిండా షోలతో, స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో బిజీగా ఉంటారు సుమ కనకాల. ప్రస్తుతం ఆమె స్టార్ మా లో ప్రసారమవుతున్న స్టార్ట్ మ్యూజిక్ కి యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, ఈ షో కి తాజాగా విచ్చేసిన బిగ్ బాస్ సీజన్ 5 ఇంటి సభ్యులు జస్వంత్, లహరి, ప్రియాంక సింగ్ లు సందడి సందడి చేశారు. అయితే ఆ టైం లో అక్కడే ఉన్న సమంత ఫోటో చూసి నువ్వు సూపర్ సామ్ ఐలవ్ యూ అని అన్నాడు.

ఇంతలో సుమను చూసి ..సుమ మీరు గ్రేట్ అంటూ వెనుక పడ్డాడు దాంతో సుమ పరుగులు తీసింది. జస్వంత్ దగ్గరకు వెళ్లి మీరు గ్రేట్ సుమ అంటూ వెనక్కి వచ్చేశాడు. దాంతో సుమ హమ్మయ్య అక్కడితో ఆగవా నాయన ఎక్కడ సమంతకు ప్రపోజ్ చేసినట్లు నాకు కూడా ప్రపోజ్ చేస్తావని పరుగులు తీసాను అంటూ పంచ్ వేసింది. అలా ఆ ప్రోమో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ ఎపిసోడ్ ప్లే అయితే వాళ్ళు మరెంత అల్లరి చేశారో అర్దం అవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: