టీవీ 9 తెలుగు మీడియా రంగంలో మొదటి స్థానానికి చేరుకుందని రెండు వారాల కిందట తెగ ఆనంద పడిపోయారు. సంబరాలు చేసుకున్నారు. తెలుగు ప్రజలు అందించిన ఆశేష విజయమని గంతులేశారు. తీరా రెండు వారాలు గడవకముందే ఎన్టీవీ మొదటి స్థానంలోకి వచ్చేసింది. దీంతో టీవీ 9 వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీవీ 9 వ్యూస్‌ సోషల్ మీడియాలో ఎన్టీవీ కంటే పది రేట్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కానీ బార్క్ మాత్రం తప్పుగా ర్యాంకులు ప్రకటిస్తూ టీవీ 9 ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోందని టీవీ 9 ఆరోపిస్తోంది.


దీనికి సంబంధించి అఫిషీయల్ గా టీవీ 9కు ఎక్కువగానే సోషల్ మీడియాలో ఫాలోవర్స్, వ్యూయర్స్, సబ్ స్కైబర్స్ ఉన్నారు. ఎన్టీవీ కంటే రెండు నుంచి రెండున్నర శాతం మంది వీవర్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో కూర్చుని టీవీ 9 చూసే వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీవీ 9, ఎన్టీవీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.


నిజాయతీ విజయం మాది అంటూ ఎన్టీవీ తెగ ప్రచారం చేసేసుకుంటోంది. బార్క్ సరైన రేటింగ్స్ ఇవ్వకుండా చేస్తోందని టీవీ 9 ఆరోపిస్తుంది. టీవీ 5 కంటే ఆంధ్రజ్యోతిని సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి వాటిలో ఎక్కువగా పాలో అవుతున్నారు. బార్క్ చెప్పేవి అన్ని అబద్దాలు అని టీవీ 9 ఆరోపిస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా కంటే ఎక్కువగా సోషల్ మీడియాను ప్రజలు పాలో అవుతున్నారు. గతంలో వార్తలు అంటే టీవీ 9 అని తెలిసిపోయేది. కానీ బార్క్ ప్రకటిస్తున్న ర్యాంకుల్లో  నిజాలు లేవని టీవీ 9 వాదిస్తోంది. ప్రజలకు సరైన సమాచారం అతి తక్కువ సమయంలో ఇవ్వడంతో నమ్మకం పెరుగుతుంది. ప్రస్తుతం టీవీ 9, ఎన్టీవీలు మేమంటే మేము అనుకునే వరకు వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tv9