
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిది స్టాలిన్.. సనాతన ధర్మం గురించి మాట్లాడిన మాటలకు స్పందించడంతో నెటిజనుల నుంచి పలు ప్రశ్నలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు ఈమెను ప్రశ్నలతో సంధిస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు.. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలి అని ఒక నెటిజన్ అనగా.. నేను నటనలో భాగంగానే అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నాను.. డైరెక్టర్ విజన్ ను బట్టి ఒక నటిగా నేను అలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చింది.
ఇక దీనిపై మరొక నేటిజన్ స్పందిస్తూ.. ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా రేపు పొద్దున మీకు పెళ్లి అయిన తర్వాత మీ కొడుకు లేదా మీ కూతురు మీ డ్రెస్సులను మీ ఫోటోలను చూసి ఏంటి అమ్మ ఇలా ఉన్నావ్? అని అడిగితే అప్పుడు మీ సమాధానం ఏంటి ?అని అడగ్గా..ఆ నెటిజన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది రష్మీ. అది నాకు సంబంధించిన విషయం ..నా పిల్లలకు సంబంధించిన మ్యాటర్.. ఇప్పుడు నువ్వేమీ నన్ను పెళ్లి చేసుకోవడం లేదు కదా.. మరి నీకేంటి సమస్య అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.