బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో ఈ రోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రాత్రి 7 గంటల నుండి ప్రారంభం కానుంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రిన్స్ యావర్ రూ.15 లక్షలు సూట్కేస్ తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. దాదాపు 15 వారాలపాటు హౌస్ లో ఉండి ప్రత్యర్థులతో పోరాడి కప్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి తన స్టామినా నిరూపించిన యావర్.. ఇలా టైటిల్ ను అందుకోకుండా డబ్బులు తీసుకొని బయటకు రావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రిన్స్ యావర్ ఇలా డబ్బులు తీసుకోవడానికి అసలు కారణం తాజాగా వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


 ఇక ప్రిన్స్ యావర్ కు ఎక్కువ మొత్తంలో అప్పులు ఉన్నాయని.. ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 15 లక్షల రూపాయలతో పాటు రేమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉండడంతోనే ఆ డబ్బును తీసుకొని అప్పులు తీర్చేయొచ్చు అని ఆలోచించిన ప్రిన్స్ యావర్ ఇలా డబ్బులు తీసుకుని బయటకు వచ్చినట్లు సమాచారం.  అయితే ఇలా డబ్బులు తీసుకొని మంచి పని చేశారని కొంతమంది చెబుతున్నారు. మరొకవైపు బిగ్ బాస్ షో కి సంబంధించి తాజాగా గ్రాండ్ ఫినాలే ప్రోమో ని విడుదల చేశారు. అందులో రవితేజ సినిమాలో ఛాన్స్ కోసం అమర్ దీప్ కూడా బయటకి వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. మరి ఏం జరుగుతుందనేది సస్పెన్స్ గానే మిగిలింది.


ఇక బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా మహేష్ బాబు వచ్చారని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు బిగ్బాస్ ఫినాలే ఎపిసోడ్ షూట్ మొదలైందని.. ఇక షో ఫినాలే రేటింగ్స్ ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయని కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఈ షో కోసం నాగార్జున చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.  ఎందుకంటే ఒకవైపు బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్లో పాల్గొంటూనే .. మరొకవైపు ఆయన నటించిన సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. అంతేకాదు నా సామిరంగా సినిమా ప్రమోషన్స్ కోసం తన మూవీ నుంచి అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అలాగే డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ కూడా ఈ షో కి హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: