ఒకప్పుడు తెలుగులో స్టార్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఉదయభాను ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. అప్పట్లో హాట్ హాట్ గా దుస్తులు వేస్తూ స్పైసీగా మాట్లాడుతూ ఉండేది. ప్రతి షో తో కూడా తన ఇమేజ్ను సైతం పెంచుకుంటూ ఉండేది ఉదయభాను... ఒకప్పుడు బుల్లితెరను ఏలిన మకుటం లేని మహారాణిగా ఉదయభాను పేరు బాగా వినిపించేది..ప్రస్తుతం యాంకర్ సుమ వచ్చిన తర్వాత చాలామందికి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఉదయభాను బుల్లితెర నుంచి గ్లామర్ షో వైపుగా అడుగులు వేసి తన అందచందాలతో ఆకట్టుకుంది.


ఉదయభాను యాంకర్ గా చేస్తున్నప్పుడు సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేదు.. ఒకవేళ ఉండి ఉంటే లైఫ్ పూర్తిగా మారిపోయేదని చెప్పవచ్చు.. యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు తన గ్లామర్ మీద ఫుల్ ఫోకస్ పెడుతూ ఉండేది ఉదయభాను. కానీ ఈమె జీవితంలో అనుకోని ఇబ్బందులు కష్టాల వల్ల ఈమె కెరీర్ కు బ్రేక్ వచ్చేలా చేశాయి. అంతేకాకుండా వివాహం చేసుకున్న తర్వాత బుల్లితెరకు దూరమైంది. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ ఆమె బుల్లితెర పైన అభిమానులను సైతం అలరించేందుకు సిద్ధమయ్యింది.. ప్రముఖ ఛానల్లో సూపర్ జోడి అనే డాన్స్ ప్రోగ్రాం కు హోస్టుగా  వ్యవహరించబోతోంది.అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా తాజాగా వైరల్ గా మారుతోంది.దీంతో అప్పటి ఉదయభాను అభిమానులు సైతం ఫుల్ ఖుషి అయ్యేలా కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈమె వయసు 51 ఏళ్లు అయినప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది.ఈమె అందాన్ని చూసి ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ కుళ్ళుకొనేలా కనిపిస్తోంది. ఈనెల 28వ తేదీ నుంచి ఈ ప్రోగ్రాం మొదలు కాబోతోంది.. అయితే ఈ ప్రోమోకి గోల్డెన్ లేడీ ఉదయభాను అంటూ క్యాప్షన్ ని రాసుకోవడం జరిగింది.. తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూనే సూపర్ జోడి ప్రోగ్రాం తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది. దీంతో ఇతర యాంకర్స్ కు సైతం చెక్ పెట్టేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: