వివిధ రకాల గెటప్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న జబర్దస్త్ కమెడియన్ నూకరాజు.. ఈమధ్య మరింత పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే.. ఒకవైపు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లలో కమెడియన్ గా చేస్తూ మంచి పేరు దక్కించుకున్న ఈయన మరొకవైపు తన ప్రియురాలు ఆసియాను స్టేజ్ పైనే ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.. ఇక ఆమెను వివాహం చేసుకోకపోయినా ఆమెతో యూట్యూబ్ ఛానల్ పెట్టించి.. ఆమెకు అండగా నిలిచిన నూకరాజు రకరకాల షోలలో ఆమెతో కలిసి సందడి చేస్తూ ఉంటారు.. అంతేకాదు బయట విహారయాత్రలకు వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ ఉంటారు..

అయితే ఇన్ని రోజులు చట్టపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు అనే వార్త తెరపైకి వచ్చింది.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ "కాఫీ విత్ శోభా శెట్టి" అనే షో ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఈ షో కి నూకరాజు పంచ్ ప్రసాద్ తో కలిసి హాజరయ్యారు. ఇక ఈ షోలో భాగంగానే నూకరాజు ఆసియాకు ఫోన్ చేసి.. "నువ్వు నాకు నచ్చలేదు.. నేను నీకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాను" అంటూ నూకరాజు చెప్పాడు.. దీంతో నూకరాజు చెప్పిన మాటలకు " ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ .. నేను ఏమి తప్పు చేశాను.. ఒకవేళ తప్పు చేసి ఉంటే చెప్పు "అంటూ ఏడ్చేసింది.. ఆ తర్వాత "నీకు నేను నచ్చకపోయినా సరే కానీ ఎందుకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావో కారణం చెప్పు" అని వేడుకుంది. దీంతో నూకరాజు పక్కనే ఉన్న కమెడియన్ పంచ్ ప్రసాద్ ఫోన్ తీసుకొని మాట్లాడటంతో ఇదంతా ఫ్రాంక్ అని అర్థం అయింది. మొత్తానికి ఎక్కడున్నావ్ రా అని తెలుసుకొని తర్వాత కాల్ కట్ చేసింది ఆసియా.. ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో ఇది చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఫ్రాంక్ వీడియో అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: