టాలీవుడ్ లో స్టార్ సింగర్ గానే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పి మంచి పాపులారిటీ సంపాదించుకుంది సింగర్ సునీత.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె పాడిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి అందించిన ఘనత అందుకుంది సింగర్ సునీత. ఇప్పటికి కూడా ఈమె పలు సినిమాలలో పాటలు పాడుతూ బాగానే రాణిస్తోంది.


మొదటి వివాహమై తన భర్తతో కొన్ని కారణాల చేత విడిపోయిన సింగర్ సునీత అనూహ్యంగా మ్యాంగో మీడియా అధినేత  రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడంతో సునిత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. వివాహం అయ్యే సమయంలో చాలా రకాలుగా ట్రోల్స్ ఎదుర్కొన్న సింగర్ సునీత వాటన్నిటిని పట్టించుకోకుండా కెరియర్ పరంగా దూసుకుపోతోంది. సునీత మొదటి భర్త తో ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ప్రస్తుతం రెండో భర్తతో 45 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వబోతుందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పైన సునీత దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.


సునీత ఈ వార్తల పైన స్పందిస్తూ.. ఇప్పటికే ప్రెగ్నెంట్ అంటూ తన పైన వచ్చిన వార్తలపై ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను.. ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి అంటూ ఫైర్ అయ్యింది. ఏ విషయమైనా ఉంటే కచ్చితంగా మేము తెలియజేస్తాము.. ఎలాంటి విషయాన్నైనా మేము ఎందుకు దాచిపెడతాం.. ఇలాంటి విషయాలను సంతోషంగా అందరితోను పంచుకుంటామంటూ సింగర్ సునీత నేటిజెన్స్ పైన ఫైర్ అయ్యింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరొకసారి చర్చనీ అంశంగా మారింది. సింగర్ సునీత కొడుకు హీరోగా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: