బుల్లితెరపై అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన సీరియల్స్ లో మొగలిరేకులు సీరియల్ కూడా ఒకటి.. ఇందులో చాలామంది నటీనటులు ఇప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో పవన్ సాయి కూడా ఒకరు.. మొగలిరేకులు సీరియల్ కీలకమైన పాత్రలో కనిపించారు ఈ నటుడు..ఆ తర్వాత తెలుగులో కూడా ఎన్నో సీరియల్స్ లో నటించారు.దాదాపుగా 13 సంవత్సరాలు బుల్లితెర పైన బాగానే రాణిస్తున్నారు పవన్ సాయి.. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి తన పర్సనల్ లైఫ్ జీవితంలో కొన్ని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.


ముఖ్యంగా తన భార్యతో విడిపోతున్నారనీ చాలా రోజులుగా వీరిద్దరూ వేరు వేరుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఈ విషయం పైన ఒక పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.. తన పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితం గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు.. కేవలం తాను మధు పరస్పర అంగీకారంతోనే తామిద్దరం చాలా కాలం క్రితమే విడిపోయామని ఇప్పుడు మా జీవితాలు మేము బ్రతుకుతున్నాము.. ఏది ఏమైనా ఇప్పటికీ ఒకరి ఒకరము సపోర్టు చేసుకుంటూనే ఉన్నామని తెలిపారు. అలాగే ఎవరూ కూడా మా గురించి దిగులు పడకండి మా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేదంటూ తెలిపారు.


పవన్ సాయి గతంలో మధు అనే అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. ఎప్పుడు సీరియస్ లో బిజీగా ఉండే పవన్ సాయి ఇటీవలే సోషల్ మీడియాలో అభిమానులతో ఒక చిట్ చాట్ నిర్వహించారు. అందులో ఒక అభిమాని వదిన బాగున్నారా అని అడగగా తనతో ఎవరూ లేరని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నానని రిప్లై ఇవ్వడంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే పవన్ సాయి మధు విడిపోయారని వార్తలు మరింత వైరల్ గా మారడంతో పాటుగా కొన్నేళ్లుగా పవన్ సాయి పెద్దగా సీరియల్ లో కనిపించడం లేదు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు విడిపోవడంపై  క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: