మొదట యూట్యూబర్ గా ఆ తర్వాత పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు మహేష్ విట్టా.. ఆ తర్వాత బిగ్ బాస్ షో లొకి ఏంట్రి ఇచ్చి మరింత పేరును సంపాదించుకున్నారు.ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను కూడా కడుపుబ్బ నవ్వించారు మహేష్ విట్టా. ప్రస్తుతం పెద్ద నిర్మాతలు తమ సినిమాలతో పాటుగా వాళ్ల బ్యానర్లు తెరకెక్కించిన చిన్న చిన్న చిత్రాలను సైతం అమ్మేస్తున్నారంటు మహేష్ విట్టా వెల్లడించారు.


ఇండస్ట్రీలో చాలామంది ఎదురు డబ్బులు ఇచ్చి మరి పాత్రలు చేస్తూ ఉన్నారని మొదట క్లోజ్ అయ్యి పార్టీలు ఇచ్చి ఆ తర్వాత పాత్రలు కూడా అడుగుతూ ఉన్నారని వెల్లడించారు. బడ సినిమాలకు సమయాన్ని వృధా  చేసుకోరని పాత్ర చెప్పి డేట్లను కూడా ఖచ్చితంగా ఇస్తారని వెల్లడించారు మహేష్ విట్టా. అలాగే చాలా సందర్భాలలో రెమ్యూనరేషన్ ని  పూర్తిగా ఎగరగొట్టిన వారు కూడా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా 16 రోజులు నైట్ షూటింగ్లో పాల్గొని పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వకుండా చాలామంది మోసం చేశారని కూడా తెలియజేశారు.


రొమాంటిక్ అనే సినిమాకి అడ్వాన్స్ ఇచ్చారని ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని కూడా తెలిపారు. కొంతమంది ఆడిషన్ అని నాలుగు సార్లు తిప్పించుకొని పనిచేయించుకొని వద్దని చెప్పిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారని తెలిపారు. తన మొట్టమొదటి రెమ్యూనరేషన్ రూ .200 రూపాయలు అంటూ తెలియజేశారు మహేష్ విట్టా. అలాగే నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రానికి పూర్తిగా ఫ్రీగానే నటించానని వెల్లడించారు. మహేష్ విట్టా కెరియర్ పరంగా ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు ముఖ్యంగా యూట్యూబ్లో ప్రసారమయ్యేటువంటి ఫన్నీ కామెడీ సీన్స్ తోనే మంచి పాపులారిటీ సంపాదించారు. అలాంటి సీన్స్ లతోనే సినిమాలలో కూడా నటించే విధంగా అవకాశాలను అందుకున్నారు మహేష్ విట్టా. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: