త్వరలోనే బిగ్ బాస్-8 కి సంబంధించి లిస్టు కూడా రాబోతోంది ఎప్పటిలాగాని నాగార్జున హొస్టుగా చేయబోతున్నారు. సరికొత్తగా ప్రమోషన్స్ని సైతం చేస్తున్నట్లుగా ఇటీవలే ప్రోమో ని చూస్తే మనకి అర్థమవుతుంది. వెరైటీ టాస్కులు ,మైండ్ గేమ్స్, ఇంటర్ డ్యూస్ వెరైటీగా కూడా చేస్తారని కాపు ఉన్నది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారిలో వరుణ్ సందేశ్, అఖిల్, ఆలి రాజా , విజే సన్నీ వంటి వారి కెరియర్ ఒకరకంగా ముందుకు సాగుతోంది... కానీ బిగ్బాస్ వల్ల ఎవరికి ఒరిగేది లేదంటూ షకీలా మాట్లాడుతూ కేవలం నాగార్జునకే తప్ప ఎవరికీ ప్లస్ ఉండదంటు ఆమె వెల్లడించింది.
అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్-6 కంటిస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇనయ సుల్తానా బిగ్ బాస్ షో గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఇటీవల ఈమె అశ్విన్ బాబు హీరోగా వచ్చిన శివం భజే అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ లో ఇనయ మాట్లాడుతూ.. హౌస్ నుంచి అందరూ బయటికి వచ్చాక ఆఫర్లు వస్తాయనుకుంటారు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి.. అవకాశాలు రావడం లేదు.. బిగ్బాస్ లోకి వెళ్లక ముందు ఎలా తిరిగామో ఇప్పుడు కూడా అలాగే తిరుగుతున్నామంటూ తెలిపింది ఇనయ. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.వాస్తవంగా చెబుతే బిగ్ బాస్ వల్ల ఎవరి కెరియర్ మారదు.. చాలా మటుకు తన కెరీర్ కూడా హౌస్ లోకి వెళ్లడం వల్లే నాశనం అయ్యిందంట ఈ ముద్దుగుమ్మ తెలిపింది.