
తాజాగా ఇప్పుడు బార్బరిక్ అనే చిత్రంలో కీలకమైన పాత్రలో ఉదయభాను నటిస్తోందట. అయితే ఈ చిత్రంలో ఉదయభాను విలన్ రోల్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.. అది ఎలా ఉంటుందంటే మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్ర లాగా ఉంటుందని వినిపిస్తోంది. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది.ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ మారుతి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకుంది.మరి విలన్ పాత్రలోనైనా యాంకర్ ఉదయభాను కెరియర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి మరి.
ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు నటిస్తూ ఉన్నారు. ఉదయభాను పాత్ర మాత్రం చాలా ప్రత్యేకించి ఉండబోతుందట. ఇప్పటివరకు ఈమెకు సంబంధించి పాటలు కూడా విడుదల చేశారు. త్వరలోనే బార్బరిక్ సినిమా విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించబోతోంది. ఇటీవలే యాంకర్ ఉదయభాను కూడా అక్కడక్కడ పలు రకాల ఈవెంట్స్ లలో కూడా చేయడానికి సిద్ధపడుతోంది. గతంలో కూడా ఉదయభాను అవకాశాలు రాకపోవడానికి ఇండస్ట్రీలో సిండికేట్ నడుస్తోంది అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.