
ఈమెకు 2021లో సౌమిత్ రెడ్డి తో నిశ్చితార్థం కాగ అప్పట్లో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి పీటల వరకు వచ్చిన ఈ వివాహం ఎందుకు ఆగిపోయిందనే విషయం పైన అన్షు రెడ్డి మాట్లాడడం జరిగింది. తనకు ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ అది బ్రేకప్ అయ్యిందని.. ఆ ఫ్యామిలీ తనకు సెట్ కాలేదని అది పిచ్చ లైట్ .. అతనొక అన్ లక్కీ ఫెలో అంటూ తెలియజేసింది.
ఆ సిచ్యువెషన్ చాలా టఫ్ గా మారింది . ఆ తర్వాత నార్మల్ అవ్వడానికి కొద్ది రోజులు సమయం పట్టిందని.. మనం హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడే ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయని తెలిపింది. అన్షు రెడ్డి యూట్యూబ్ ద్వారానే రూ.4 లక్షల రూపాయల వరకు ప్రతినెలా సంపాదిస్తోందట. కానీ ఇప్పుడు వీడియోలు చేయడం మానేయడంతో తన ఇన్కమ్ చాలా తగ్గిపోయిందని.. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటే కంటెంట్ వస్తూ ఉండడంతో జనాలకు బోరు కొట్టేసింది అందుకే ఏదైనా కొత్తగా చేయడానికి లేకనే వీడియోలను ఆపేశానంటూ తెలిపింది అన్షు రెడ్డి.. మొత్తానికి ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందనే విషయాన్ని తెలిపింది అన్షు రెడ్డి.