భారతదేశంలో డిజిటల్ ప్రపంచాన్ని ప్రతి చేతిలోకి తీసుకువచ్చే విధంగా  చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన జియో రాకతో టెలికాం రంగంలో పెద్ద ఎత్తున మార్పులు సంభవించాయి. అంతవరకు నెల రోజుల అంతటికి కలిపి 1 జీబీ లేదా 2 జీబీ వాడేవారు.  ఇప్పుడు రోజుకి 2 జీబీ వరకు వాడేస్తున్నారు. అంతలా ప్రతి ఒక్కరి జీవితంలో డేటాను అలవాటుగా మార్చారు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ. అయితే ఇప్పుడు జియో సంస్థ రిటైల్ రంగంలో కూడా అడుగుపెట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి జియో మార్ట్ ద్వారా రిటైల్ బిజినెస్ లోకి వచ్చింది సంస్థ.

 

తాజాగా దీనికి సంబంధించి జియో మార్ట్ ఆప్ గూగుల్ ప్లే స్టోర్ ఐఓఎస్ స్టోర్ లో రిలీజ్ చేశారు. అతి తక్కువ కాలంలో గూగుల్ ప్లేస్టోర్ లో ఏకంగా పది లక్షల డౌన్లోడ్స్ ను అందుకుంది జియో మార్ట్ యాప్. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ లో షాపింగ్ కేటగిరీలో టాప్ మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతానికి భారతదేశంలో రెండు వందల నగరాలు, పట్టణాల్లో వారి సేవలను అందిస్తోంది. అయితే వారి వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే సేవలు ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. ఇప్పుడు యాప్ కూడా అందుబాటులోకి రావడంతో జియో మార్ట్ కు  మరింతగా స్పందన పెరిగింది అని చెప్పవచ్చు.

 

ఇదివరకు కేవలం వెబ్ సైట్ లో మాత్రమే ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు మొబైల్ కూడా రావడంతో మరింతగా జియో మార్ట్ ముందుకు దూసుకు వెళుతోంది. జియో మార్ట్ ఎంత మోతాదులో ఆర్డర్ చేసిన ఎటువంటి షిప్పింగ్ చార్జెస్ లేకుండా డెలివరీ ని అందిస్తోంది. ఇక మిగతా షాపింగ్ సైట్స్ అమెజాన్, గ్రోఫర్స్, ఫ్లిప్ కార్ట్ లాంటి సూపర్ మార్కెట్ సైట్స్ లో మినిమం ఆర్డర్ ఇంత అని తెలిపి ఆ తర్వాత నే ఫ్రీ హోం డెలివరీ అందిస్తున్నాయి. అయితే ఇలాంటి కండిషన్స్ లాంటివి లేకుండా జియో మార్ట్ లో పూర్తిగా ఎంత తక్కువ ఆర్డర్ చేసిన ఉచితంగానే ఇంటికి సరుకులను చేరవేస్తున్నారు. 

 

మిగతా షాపింగ్ సైట్స్ మాదిరిగానే ఇందులో కూడా అన్ని రకాల కు సంబంధించిన ప్రొడక్ట్స్ మనకు అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అంతే కాదు ప్రతి ఒక్క వస్తువుకు అయినా 5 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తోంది జిఓ మార్ట్. అంతేకాకుండా రిలయన్స్ రిటైల్ కస్టమర్లకు లభించే రిలయన్స్ వన్, ఆర్ వన్ లాయల్టీ ప్రోగ్రాం జియో మార్ట్ కస్టమర్లు కూడా లభించనుంది. వారికి మరికొన్ని ఎక్స్ క్లూజివ్ ఆఫర్స్ ని అందచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: