GB whatsapp,WHATSAPP PLUS ఈ రెండిటి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.. ఈ వాట్సాప్ లు మీ మొబైల్ లో ఉన్నట్లైతే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.
GB WHATSAPP:
ఈ వాట్స్అప్ మనం మామూలు వాట్స్అప్ మాదిరే పనిచేస్తుంది. ఈ జీబీ వాట్సాప్ పూర్తిగా విభిన్నమైనది. ఈ వాట్సాప్ ఆపిల్ స్టోర్, ప్లే స్టోర్లో అందుబాటులో ఉండదు. దీనిని మనం గూగుల్ సెర్చ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుచేతనే ఇది థర్డ్ యాప్ కింద దీనిని డెవలప్ చేయబడింది. ఈ యాప్ కు వాట్సప్ కు అసలు ఎలాంటి కనెక్షన్ ఉండదు. అందుకోసమే వాట్సాప్ సంస్థ ఈ వాట్సాప్ ని అసలు ఉపయోగించవద్దని తెలుపుతూ వస్తూ ఉంటుంది. ఇక అలాగే whatsapp PLUS కూడా చాలా ప్రమాదమని సూచించింది.
ఈ రెండు వాట్సప్ లు ఉండడం వల్ల ప్రమాదం ఏమిటి..?
మనం ఈ యాప్ ను ఉపయోగించుకున్నట్లయితే... సరాసరి ప్రమాదంలో చిక్కుకున్న ట్లే. అని తెలిపింది వాట్సాప్ సంస్థ. ఇక ఇందులో మీ డేటా సెక్యూరిటీ పరంగా ఉండదని తెలిపింది. ఇక అదే విధంగా ఎటువంటి రహస్యం అయిన వాళ్ళు ఈజీగా మీ డేటాను సేకరించవచ్చు. ఇక ఈ యాప్ ఉండడంవల్ల మీ మొబైల్ వైరస్ బారిన పడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుపుతూ వచ్చింది.
దాంతోపాటు మీ మొబైల్ హ్యాక్ చేయవచ్చు. అందుచేతనే ఈ రెండింటి యాప్ లకు దూరంగా ఉండాలని వాట్సాప్ సంస్థ తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి