టాటా మోటార్స్ ఓన్ చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్  డి8 (D8) ప్లాట్‌ఫారమ్ నుండి తీసుకోబడిన OMEGARC (ఆప్టిమల్ మాడ్యులర్ ఎఫిషియెంట్ గ్లోబల్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫారమ్‌పై కొత్త సఫారీని తయారు చేసింది. దీని ఛాసిస్ మోనోకోక్ నిర్మాణాన్ని కలిగి ఉండి, చాలా తేలికగా ఉంటుంది. అదే సమయంలో ఇది మెరుగైన బిల్డ్ క్వాలిటీని కూడా కలిగి ఉంటుంది. అత్యుత్తమ డ్రైవింగ్ డైనమిక్స్, తేలికైన నిర్మాణం ఇంకా అలాగే మెరుగైన భద్రత  అదనపు ప్రయోజనాల వలన కస్టమర్లు టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్‌ను ఎంచుకునేలా చేస్తాయని కంపెనీ తెలిపింది.టాటా సఫారీ ఎస్‌యూవీలో కొత్తగా వచ్చిన XMS వేరియంట్ ఇప్పుడు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో యాడ్ చేయబడి ఉంటుంది.ఈ అధునాతన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ టిప్‌ట్రానిక్ ఫంక్షన్‌తో మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తూ, మీ రోజువారీ సిటీ డ్రైవ్‌లను సులభతరం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకించి, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నగరాలలో ప్రయాణించే వారికి ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పనితీరు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


టాటా సఫారీ టాటా హారియర్ లాగానే ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అయితే, టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ లోని 2.0 లీటర్ ఫియట్ క్రియోటెక్ డీజిల్ ఇంజన్‌ మాక్సిమం 170 బిహెచ్‌పి పవర్ ని ఇంకా 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ఇంకా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ లతో యాడ్ చేయబడి ఉంటుంది. టాటా సఫారిలోని ఈ పవర్‌ట్రెయిన్ సెటప్ అన్ని రకాల భూభాగాలపై డ్రైవ్ చేయడానికి తగినంత పవర్ ని అందిస్తుంది.టాటా సఫారీ  లేటెస్ట్ వేరియంట్లయిన XMS ఇంకా XMAS లు ఇప్పుడు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతాయి. ఇవి చూడటానికి ఓ కన్వర్టబల్ కారును నడుపుతున్న అనుభూతిని అందిస్తాయి. భారతీయ వాతావరణ పరిస్థితుల్లో దీని ఉపయోగం ఇంకా దాని ప్రాక్టికాలిటీ వివాదాస్పదమైన అంశమే అయినప్పటికీ, ఎస్‌యూవీలోని ఈ ఫీచర్ మాత్రం చాలా మందికి బాగా నచ్చుతుంది.ప్రత్యేకించి, ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణాలు చేసే వారు దీనిని ఎక్కువగా ఇష్టపడుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: