హోండా కంపెనీ..HONDA CB -350 అనే పేరుతో ఒక కొత్త బైక్ను తీసుకువచ్చింది. దీని ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రజాదారణ ఏ విధంగా పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు బండి కొనాలని అనుకునే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎక్కువగా ఎంపిక చేస్తున్న వాటిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ కూడా ఒకటి. ఇటువంటి పరిస్థితులలో దాని దరిదాపులలో కూడా మరొక బైకు వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు.



అంతలా రాయల్ ఎన్ఫీల్డ్ క్రేజ్ ఏర్పడింది. కానీ హోండా ఆ సాహసం చేస్తోంది ఇప్పుడు..HONDA -350 బైకుతో రాయల్ ఎన్ఫీల్డ్ కి గట్టి పోటీ ఇస్తోంది. అమ్మకాల పరంగా ఈ బైక్ చాలా వెనుకబడి ఉన్నప్పటికీ ఇప్పుడు కంపెనీ తన అప్డేట్ వేరియంట్లను విడుదల చేస్తోంది. క్రూయిజర్ సెగ్మెంట్లో వస్తున్న ఈ బైక్ చాలా స్టైలిష్ గా ఉంది.349 CC ఇంజన్ కలిగి ఉంది. ఈ బైక్ రెండు మోడల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.1.5 లక్షల నుంచి మొదలవుతుంది. హోండా రెండు బైక్ల ఫీచర్ లలో  స్వల్ప మార్పులు చేసి అప్ గ్రేట్ చేయడం జరిగింది.ఇప్పుడు ఇందులో మునపటి కంటే ఎక్కువ ఫీచర్లు కూడా పొందుపరిచింది.

హోండా కొత్త CB -350 బైక్ లో అనేక మార్పులు చేసింది. వీటిలో ఒకదాని సిలిండర్ మార్పు మరొకటి ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కూడా.. ఇందులో బ్రేకులు వేసినప్పుడు వెనుక ఉన్న వాహనాలు మొత్తం అలర్ట్ అయ్యేలా చేస్తుంది ఈ ఫీచర్ ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది ప్రతి ద్విచక్ర వాహనానికి కూడా తప్పనిసరిగా ఉండబోతుందట. ఇక ఈ రెండు బైకులు 349సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటాయి. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తో కలిగి ఉన్నది. కొత్త బైకులు ధర ఇప్పుడు కంటే 11 వేల రూపాయలు ఎక్కువగా ఉంటుందట. అంటే హెచ్ ఎస్ ధర రూ.2.10 లక్షల నుంచి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: