రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ అణ్వస్త్రాల గురించి మళ్లీ చర్చ మొదలైంది.  రష్యా తన దేశంలోని అణ్వాయుధాలను పక్క దేశం అయినా బెలారస్ లోకి తీసుకెళ్లింది. ఒక వేళ నాటో దేశాలు అన్ని కలిపి రష్యా పై దాడి చేయాలని ప్రయత్నిస్తే ఇటు రష్యా నుంచి, అటు బెలారస్ నుంచి దాడి చేసేందుకు వీలుగా పుతిన్ ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్నారు.


బెలారస్ రష్యాకు మిత్ర దేశంగా కొనసాగుతుంది. కానీ ఉక్రెయిన్ తో యుద్దం తర్వాత బెలారస్ మీద కూడా నాటో, యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. లిథియా, తదితర నాటో దేశాలు బెలారస్ పై యుద్ధం చేయాలని అనుకున్న అక్కడ ఉన్న అణ్వస్త్రాలను చూసి భయపడాల్సిన పరిస్థితి. మొన్నటి వరకు వ్యాగనర్ సైన్యం బెలారస్ లో తల దాచుకుంది. పుతిన్ కు వ్యతిరేకంగా వ్యాగనర్ సైన్యం పని చేసిన విషయం తెలిసిందే.


వ్యాగనర్ చీప్ ప్రిగోజన్ ఫ్లైట్ ప్రమాదంలో చనిపోవడంతో పుతిన్ కు ఇప్పుడు అసలు ఎదురు లేకుండా పోయింది. అయితే అమెరికా కూడా ఒక వేళ రష్యాతో అణు యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు తమ దేశంలో ని అణ్వాయుధాలను బ్రిటన్ వద్ద ఉంచేందుకు రెడీ అయింది. అయితే ఏ దేశంలో ఉన్న అణ్వాయుధాలు అక్కడే ఉండాలి. వాటి సరఫరా కానీ కొనుగోలు కానీ ఇతర దేశాల్లో వాటిని నిల్వ ఉంచకూడదని 2008 లో జరిగిన అణ్వస్త్ర ఒప్పందంలో అమెరికా సంతకం చేసింది.


కానీ దీనికి భిన్నంగా ఇప్పడు తన అణ్వాయుధాలను బ్రిటన్ లో పెట్టేందుకు సిద్ధమైంది. ఇదంతా కుట్రలో భాగంగానే జరుగున్నట్లు రష్యా ఆరోపిస్తుంది. అయినా తాము భయపడబోమని చెబుతుంది. దీంతో రాబోయే రోజుల్లో అణు యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుత మార్గంలోనే పరిష్కరించుకుంటే మంచిదని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు ఇరు దేశాలకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: