భారతదేశంలో ఓటు వేయడానికి కచ్చితంగా ఓటు కార్డు అనేది చాలా ముఖ్యము.. దీంతో ప్రతి భారతీయుడు కూడా తమ ఓటు హక్కు ని వేయడానికి ఉపయోగపడుతుంది.. అనేక ప్రభుత్వ సేవలకు సైతం ఇప్పుడు యాక్సెస్ కార్డుగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్క పౌరులకు ఈ ఓటు హక్కు అనేది చాలా ముఖ్యము.. అయితే ఓటర్ కార్డులో చిరునామా లేదా ఏవైనా తప్పులు ఉంటే వాటిని మనం సవరించుకోవచ్చు. ఈరోజు వాటిని ఎలా సవరించుకోవాలి ఆన్లైన్ ప్రక్రియలో ఎలా అప్లై చేసుకోవాలని విషయం గురించి తెలుసుకుందాం.


ఓటర్ కార్డులో పేరు లేదా చిరునామా మార్చడానికి..
1). ముందుగా మనం నేషనల్ ఓటర్ సర్వీస్..NVSP వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.

2). అందులో మీ ఓటర్ ఐడి నెంబర్ పుట్టిన తేదీని నమోదు చేయాలి.

3). లాగిన్ అయిన తర్వాత హోటల్ జాబితా సవరణ పైన క్లిక్ చేయాలి.

4). అక్కడ చూపించిన ఫారంలో మీ సమాచారాన్ని నింపాలి.. నింపిన తర్వాత ధ్రువీకరించడానికి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.

5). చివరిగా డిక్లరైజేషన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ ఓటర్ బటన్ పైన క్లిక్ చేయాలి.. అయితే ఓటర్ కార్డులో పేరు లేదా చిరునామాలు మార్చడానికి కావలసిన పత్రాలు..

పేరు మార్చడానికి:
పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా   వల్ల మార్చుకోవచ్చు..

అడ్రస్ మార్చుకోవడానికి:
ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు సహాయంతో అడ్రస్ మార్చుకోవచ్చు.

ఓటర్ కార్డులో పేరు లేదా చిరునామాలు మార్చుకోవడానికి రుసుము విషయానికి వస్తే.. ఎలాంటి చార్జీలు ఉండవు.. దరఖాస్తు చేసిన తర్వాత మీ రిఫరెన్స్ ఐడిని మాత్రమే అందుకుంటారు. మీయొక్క అప్లికేషన్స్ స్థితిని తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ని సందర్శించుకోవచ్చు.దీనివల్ల మనం ఇంట్లో నుండే ఓటర్ కార్డు తప్పులను సరి చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: