దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా బాగా కొనసాగుతోంది.EV వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతూ ఉండడంతో రోజుకొక కంపెనీలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసే విధంగా ఇతర కంపెనీలు కూడా ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా ఇతర కంపెనీలు కూడా పోటీపడి మరి డిస్కౌంట్ లను కల్పిస్తున్నాయి.. సేల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ టు వీలర్ తయారీ సంస్థల లో ఒకటైన టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్ పైన భారీ ఆఫర్ ను ప్రకటించింది..iqube ఎలక్ట్రిక్ బైక్ పైన ఏకంగా 41 వేల బెనిఫిట్ అందిస్తోంది.

ఈ ఆఫర్ మాత్రం కేవలం కొద్ది రోజులే దేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఈ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉన్నది.. లైట్ వెయిట్ ,ఈజీ హ్యాండ్లింగ్ వల్ల వీటిని ఎక్కడైనా సరే సులువుగా నడుపుకోవచ్చు. అంతేకాకుండా టెక్నాలజీకి అనుగుణంగానే ఈవి వాహనాలు తయారీలో కూడా అధునాతన ఫీచర్స్ చాలా స్టైలిష్ డిజైన్తో కూడా మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి..EV ల తయారీ పైన కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది.ఈ సబ్సిడీని ఈ నేలతో ముగించేలా చేస్తున్నారు.


ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహన ధరలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట.దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ సంస్థ టీవీఎస్ తన ఐక్యూప్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేస్తే 41 వెల్లు ఆదా చేసుకుని అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తోంది. వీటిలో క్యాష్ బ్యాక్ ఆఫర్ 6000 రూపాయలు.. నో కాస్ట్ EMI పైన 7500 అదనపు తగ్గింపు.. ఇదేవిధంగా టీవీఎస్ ఐక్యూ ఎలక్ట్రిక్ పైన 5000 ఎక్స్టెండెడ్ వారెంటీను కూడా అందిస్తున్నది. FAME -2 సబ్సిడీ కింద 22,O65 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇలా మొత్తం అన్ని ఆఫర్లు కలుపుకుంటే 41 వేల విలువైన బెనిఫిట్స్ సైతం మనం పొందవచ్చు. పూర్తి సమాచారం కోసం దగ్గరలో ఉండే టీవీఎస్ షో రూమ్ కి వెళ్లి కనుక్కోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: