ప్రతీ వ్యక్తి తనకి సొంతంగా ఒక ఇల్లు, కారు ఉండాలని ఆశ పడుతుంటారు. వీటి కోసం తమ సంపాదనను పెంచుకునే మార్గాలను అన్వేషిస్తుంటారు. ఎప్పటికప్పుడు తమ కొనుగోలు స్థాయికి తగ్గ విధంగా మార్కెట్ లో అవి లభ్యం అవుతున్నాయా! లేదా అన్నది బేరీజు వేసుకుంటారు. అయితే అలాంటి ఆశావహులు ఇప్పుడు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అలంటి వారందరికీ మంచి శుభవార్త. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సంస్థ హ్యుందాయ్ తన కార్లపై అదిరిపోయే విధంగా భారీ డిస్కౌంట్లుతో ఆఫర్లు అందిస్తోంది. మీరు కూడా ఈ భారీ డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆఫర్ పరిమితి తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. ఇక హ్యుందాయ్ కంపెనీ అందిస్తున్న ఆఫర్లు శాంట్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఎలెంట్రా వంటి మోడళ్లపై మాత్రమే అదిరిపోయే తగ్గింపు అందిస్తోంది. డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ డిలైట్ ఆఫర్ కింద ఈ తగ్గింపు అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ బెనిఫిట్ కూడా లభిస్తుంది. రూ.8 వేల వరకు ప్రయోజనం పొందొచ్చు.
 
 

 హ్యుందాయ్ శాంట్రో కారు ధర రూ.4.63 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ధర రూ.6.31 లక్షలు. ఈ మోడల్‌ కారుపై రూ.50 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. అంతేకాకుండా మూడేళ్ల ఆన్‌రోడ్ వారంటీ లభిస్తోంది. అదే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారుపై రూ.60 వేల వరకు తగ్గింపు ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై కూడా రూ.60,000 వరకు తగ్గింపు లభిస్తోంది. హ్యుందాయ్ ఆరా కారుపై ఏకంగా రూ.70 వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఎలంట్రా కారుపై గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇకపోతే కార్ల కంపెనీలు జనవరి నుంచి కార్ల ధరలు పెంచుతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ సదావకశాన్ని వినియోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: