ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్నారి పాప ల పై జరుగుతున్న అత్యాచార కేసులు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత కఠినమైన శిక్షలు విధించినా కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రతిరోజూ ఏదో ఒక చోట ఏదో ఒక మూల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ కేసులు పరిష్కారం కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతూ వస్తోంది. అయితే ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఒక సంచలన కోర్టు తీర్పు ఇప్పుడు బాగా వైరల్ గా మారుతుంది ఆ వివరాలు చూద్దాం.


రాజస్థాన్ లోని ఒక చిన్నారిని అత్యాచారం చేసిన కేవలం 10 రోజుల్లో పే తీర్పునివ్వడం తో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక అంతే కాకుండా ఆ నిందితుడికి 20 ఏళ్లు జైలుశిక్షతో విధించింది. భారతీయ న్యాయస్థానం ప్రకారం వందమంది నేరస్తులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనే ఉద్దేశంతో నే ఉన్నది. అయితే రాజస్థాన్ కోర్టు మాత్రం ఈ విషయంపై చాలా భిన్నంగా ఉంది.

గత నెల 26వ తేదీన తొమ్మిదేళ్ల బాలికపై 25 సంవత్సరాలు కలిగిన మీనా అని వ్యక్తి అత్యాచారని కి పాల్పడ్డాడు.ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని అత్యాచారం గురించి గాలించి కేవలం 18 గంటల్లోనే కేసును నమోదు చేసి అందుకు సంబంధించిన వివరాలను కోర్టులో అందజేయడం జరిగింది. దాంతో ఆ వ్యక్తిపై సిటీ ఫోక్స్ 3 నంబర్ కోర్టు ఒక సంచలన తీర్పును తెలియజేసింది.

నిందితులపై బాలిక అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో కోర్టు న్యాయమూర్తి వికాస్ కుమార్ కమలేష్ ను దోషిగా నిర్ధారించి అతనికి రెండు లక్షల జరిమానా తో పాటు.. 20 సంవత్సరాలు కఠినమైన శిక్ష విధించాలి అంటూ సంచలన తీర్పు నిచ్చారు. ఈ కేసుపై జైపూర్లోని డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఈ అత్యాచార ఘటన చాలా తీవ్రమైనది అందుచేతనే.. ఈ నిందితుడిని పట్టుకోవడం కోసం 150 మంది పోలీసులు గాలించి పట్టుకున్నట్లుగా తెలియజేశారు. ఇక అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయడం ద్వారా ఈ కేసును సీరియస్గా తీసుకొని కోర్టు అతనికి కఠినమైన శిక్ష విధించింది. అంటూ డిప్యూటీ కమిషనర్ నరేంద్ర తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: