క్రికెట్ క్రీడా కారులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వాళ్లు ఏం చేసినా
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఒక మ్యూజిక్ వీడియో కోసం షూట్ చేస్తోంది . దీనికి సంబంధించిన తెరవెనుక దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వద్ద పాటకు సంబంధించిన హుక్ స్టెప్ నేర్చుకోవడం చూడవచ్చు.
డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్ ధనశ్రీ విరాట్ కోహ్లీకి డ్యాన్స్ స్టెప్పులు నేర్పించడం చూడవచ్చు. స్టెప్ నేర్చుకుని కెమెరా ముందు ఎలాంటి జంకూ లేకుండా కోహిలీ డాన్స్ ప్రదర్శించారు. ఆమె తన భర్త చాహల్ , అతని సహచరుడు దేవదత్ పడిక్కల్కి కూడా ధనశ్రీ కొన్ని స్టెప్ లను నేర్పింది
ఆన్లైన్లో పోస్ట్ చేసిన తర్వాత, వీడియోను 2.4 మిలియన్ల మంది వీక్షించారు. నెటిజన్లు కామెంట్ బాక్సాలో తమ స్పందనను తెలిపారు "వీ మరియు ధనా," కొందరు పేర్కోనగా , మరికొందరు కింగ్ కోహ్లీ అని వ్యాఖ్యానించారు.విరాట్ కోహ్లీ భారత్ ఉద్భవించిన అత్యున్నత క్రికేట్ క్రీడాకారులలో ఒకరు గా పేరు తెచ్చుకున్నారు. ఇతను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా ఖ్యాతికెక్కారు. ఓపనింగ్ ఆటగాడిగాను ఇతని పేరుంది. వన్ డే ఇంటర్వేషనల్, బిసిసిఐ ఇచ్చే ర్యాంకుల్లో ఇతనిది ప్రస్తుతం ప్రథమ స్థానం. అంతే కాదు ఇతను కుడి చేతి ఫేస్ బౌలర్ కూడా. 2008 లో మలేసియా జరిగిన అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ విజయం సాధించడానికి ఇతను తోడ్పడ్డాడు. అతని సారథ్యంలోని నాడు భారత్ కప్ ను సొంతం చేసుకోగలిగింది.