అది రోడ్ పక్కన వున్న ఓ టిఫిన్ బండి. అక్కడ ఆమ్లెట్ వేడివేడిగా దొరకుతుంది. ఇలా ఆర్డర్ ఇవ్వగానే నిమిషాల వ్యవధిలో రుచికరమైన ఎగ్ ఆమ్లేట్‌ను చేతిలో పెడతారు. తాజాగా కొంతమంది కస్టమర్స్..రుచికరమైన ఆ ఆమ్లేట్ ని తినేందుకు ఆ టిఫిన్ కొట్టుకి వెళ్లారు.ఇక వారు ఆమ్లెట్ ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. వెంటనే అక్కడ వున్న కుక్ ఓ కోడి గుడ్డును పగలగొట్టాడు. ఇక అతను ఆ గుడ్డును పగల గొట్టిన వెంటనే అక్కడ ఉన్నవారంతా కూడా ఒక్కసారిగా మైండ్ పోయి దిమ్మతిరిగి గట్టి షాక్‌ తిన్నారు.అక్కడ అతను పెనంమీద గుడ్డు పగలగొట్టగానే అందులోంచి ఓ అనుకోని అతిథి బయటకొచ్చింది. ఇక ప్రస్తుతం నెట్టింట ఈ ఆమ్లెట్‌లోంచి వచ్చిన అతిథి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ వీడియోని చూసి నెటిజన్స్ అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.కాగా కోడి గుడ్డు పగలగొట్టగానే అందులో నుంచి కోడి పిల్ల బయటకు వచ్చింది. అలా వరసగా 3 గుడ్లు పగలగొట్టగా మూడింటిలో కూడా కోడి పిల్లలే ఉన్నాయి. దీంతో ఆ టిఫిన్ బండి అతను కూడా ఒక్కసారిగా షాకయ్యాడు. ఇక ఆ కోడి పిల్లలను పక్కనే ఉన్న మరో వ్యక్తికి అందించాడు. అసలు మాములుగా అయితే.. కోడి గుడ్లను కోడి పొదిగితేనే పిల్లలు తయారవుతాయి.ఇక కోడి పొదగడం వల్ల.. కోడిపిల్ల తయారవడానికి అవసరమైన వేడి అనేది దొరుకుతుంది. కానీ ఇక్కడ చాలా ఆశ్యర్యంగా ట్రేలో పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు రావడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. భిన్నమైన కామెంట్స్ పెడుతూ తమ ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తున్నారు.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసి తనివి తీరా బాగా నవ్వుకోండి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: