సాధారణంగా మనం వాహనం తీసుకుని రోడ్డుపై ప్రయాణం మొదలు పెట్టాము అంటే చాలు రోడ్డు ప్రమాదాలు ఎక్కడ నుంచి దూసుకు వస్తాయన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనం నిబంధనలు పాటిస్తూ మన జాగ్రత్తలో మనం ఉన్న ఎదురుగా వచ్చే వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే అది కూడా మన ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది  ఇలా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే సాధారణంగా ఇప్పటివరకూ వేగంగా వెళ్తూ వాహనం బోల్తా కొట్టిన ఘటనలు.. మరో వ్యక్తి వేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనల గురించి విన్నాము. కానీ ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదం మాత్రం కనివిని ఎరుగనిది అని చెప్పాలి.


 ఎందుకు అంటారా.. ఇక్కడ వాహనం పై ఉన్నవాళ్లు నెమ్మదిగానే వాహనం నడుపుతున్నారు. ఇక ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా ఎవరూ ఆక్సిడెంట్ చేయలేదు. కానీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలాగో తెలుసా రోడ్డుపైన వెళ్తుంటే పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరి బోండా సరిగ్గా తల మీద పడింది అంటే నమ్ముతారా.. ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి తలపై సరిగ్గా వచ్చి కొబ్బరిబోండం పడటానికి అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం అలాగే జరిగింది. ఇక్కడ జరిగిన ఘటన చూసిన తర్వాత హెల్మెట్ లేకపోతే ఏం జరగదో అని తలచుకోవడానికి భయమేస్తుంది అని చెప్పాలీ.


 ఈ ఘటన మలేషియాలో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు కూడా స్కూటర్ పై తేలుర్  నుంచి జార్జ్ టౌన్ వైపు వెళ్తున్నారు  ఇక అదే ప్రాంతంలో రోడ్డు పక్కన ఒంగి ఉన్న కొబ్బరి చెట్టు ఉంది. అయితే ఇక వాహనం కొబ్బరి చెట్టు కిందికి రాగానే చెట్టు మీద నుంచి ఒక కొబ్బరి బొండం   స్కూటర్ వెనుక కూర్చున్న మహిళల పై పడింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. దీంతో వెంటనే స్కూటర్ పై నుంచి కింద పడిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం తో ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది. ఒకవేళ హెల్మెట్ లేకపోతే మాత్రం తల పగిలి పోయి ప్రాణం పోయే ప్రమాదం కూడా పోయేది అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: