అక్కడ ఇక్కడ అనే తేడా లేదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వానలు దంచి కొడుతున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎన్నో ప్రాంతాలు అతలాకుతలం అయిపోతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో దూసుకొస్తున్న భారీ వరదలతో ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోయాయ్ అన్న విషయం తెలిసిందే. కాగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజల పరిస్థితి అయితే భారీగా వరదలు  వస్తున్న నేపథ్యంలో ఆగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో దినదినగండంగా ప్రతిక్షణం భయపడుతూనే బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.


 కొన్ని ప్రాంతాల లో అయితే భారీ వర్షాల కారణం గా ఇప్పటికే ఎన్నో గ్రామాలను వరదలు ముంచెత్తాయి అనే చెప్పాలి. దీంతో ఇక వరద బాధితుల అందర్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా భారీ వర్షాల నేపథ్యం లో నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇకపోతే గుజరాత్ లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో అంబికా నది ఒడ్డున ఒక్క  సారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ఏకంగా 16 మంది వరదల్లో చిక్కుకు  పోయారు. అయితే పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్  వెంటనే కోస్ట్ గార్డ్  అధికారులను అభ్యర్థించారు.


 దీంతో వెంటనే రంగం లోకి దిగిన ఇండియన్ కోస్ట్ అధికారులు చేతక్ హెలి కాప్టర్ ద్వారా 16 మందిని అతికష్టంమీద మరదల నుంచి   కాపాడారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చక్కెర్లు కొడుతుంది. అయితే వరదల కారణంగా వస్తున్న బలమైన గాలులతో అటు హెలి కాప్టర్ సైతం ఒడిదుడుకులకు లోనవుతోంది. అయినప్పటికీ ఎంతో రిస్క్ చేసి కొస్ట్ గార్డ్  అధికారులు వరదల్లో చిక్కుకుపోయిన 16 మందిని కాపాడారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: