అడవుల్లో ఉండే అందమైన పక్షులలో ఒకటైన నెమలి మన జాతీయ పక్షి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నెమలి ఎంతో అందంగా ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పటి వరకు ఎంతో మంది కవులు తమదైన శైలిలో వర్ణించారు. అయితే భారత ఉపఖండంలో మాత్రమే కాకుండా ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఖండంలో కూడా నెమళ్లు  ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి  ఇకపోతే అందంలో చూపరుల దృష్టిని ఆకర్షించడంలో నెమలి కంటే ఏ పక్షి కూడా ముందు వరుసలో నిలువలేదు అని చెప్పాలి. అందుకే సింహాన్ని అడవికి రారాజు అని ఎలా అంటారో.. అటు నెమలిని కూడా పక్షిరాజు అని పిలుస్తూ ఉంటారు.


 ఆకాశంలో మబ్బులు కమ్ముకున్న సమయంలో లేదా వర్షం పడుతున్న సమయంలో నెమలిలు ఎంతో తన్మయత్వంలో మునిగిపోతాయి అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇలా జరిగిన సమయంలోనే వాటికి ఉన్న నెమలి పించాలని ఎంతో అందంగా విప్పి నాట్యం చేయడం మొదలు పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నెమలిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఇకపోతే నెమలి ఇటీవలే అందమైన నెమలిపించాలతో గాల్లోకి ఎగిరిన వీడియో ఒకటి ట్విటర్ వేదికగా తెగ చెక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా మంత్రముక్తులను చేస్తుంది అని చెప్పాలి.


 ఇక ఈ పక్షి అందమైన నెమలిపించాలతో గాల్లోకి ఎగురుతూ ఉన్న తీరు చూస్తే నిజంగానే ఇది భూమి మీద ఉండే పక్ష లేకపోతే ఆకాశం నుంచి దిగి వచ్చిందా అని నెటిజన్లకు అనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అడవిలో ఇరుకైన రహదారిపై రెండు నెమలి నిలబడి ఉన్నాయి. వాటిలో ఒకటి హాయిగా నడుస్తూ ముందుకు వెళుతూ ఉండగా.. మరొకటి పెద్ద నెమలిపించాలు కలిగి ఉండగా ఇక తన పెద్ద రెక్కలతో పైకి ఎగురుతున్నది మీరు చూడవచ్చు. ఇక ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి అటు నెటిజెన్లకు  రెండు కళ్ళు సరిపోవడం లేదు అని చెప్పాలి. ఈ అందమైన వీడియో మిమ్మల్ని తప్పకుండా ఫిదా చేస్తుంది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: