ఈ లాక్ డౌన్ సమయంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానితోపాటు ఇంట్లోనే నడవడం, వ్యాయామాలు చేయడం, యోగాలు చేయడం, ఎక్సర్సైజ్ చేయడం వంటివి అలవాటుగా మార్చుకోవాలి. ఈ లాక్ డౌన్ వచ్చిన తర్వాత చాలామంది సమయం గడవడం లేదని టీవీలు, ఫోన్ లకు పరిమితమవుతున్నారు. అలా కాకుండా మీ ఇంటి కుటుంబ సభ్యులతో ఆనంద క్షణాలను గడపడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇక ఎప్పుడైతే మనస్సు ఉత్సాహంగా ఉంటుందో అప్పుడు ఎలాంటి రోగాలు దరిచేరవు.