ప్రతి రోజూ డబుల్ మాస్క్ వేసుకోవడం వల్ల కొంతమేరకు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభావం చూపుతుందని తేలింది. కానీ తాజాగా డబుల్ మాస్క్ వాడకం పై కేంద్ర ప్రభుత్వం కీలకం మార్గదర్శకాలను జారీ చేసింది. అదేమిటంటే ప్రతి ఒక్కరూ రెండు మాస్క్‌లను ఒకే రకమైనవి వాడొద్దని కేంద్రం స్పష్టం చేసింది.డబుల్ మాస్క్ లను ధరించేటప్పుడు ముందు సర్జికల్ మాస్క్ దాని పైన క్లాత్ మాస్క్ అనే రెండు వేరియంట్ల మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఒకే మాస్క్ ను వరుసగా రెండు రోజుల పాటు వాడొద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సాధారణ క్లాత్ మాస్క్ 42 నుంచి 46 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని అని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్క్ అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్క్ పై క్లాత్ మాస్క్ ను ధరిస్తే కరోనా నుంచి ఏకంగా 85.4 శాతం వరకు రక్షణ లభిస్తుందని చెప్పుకొచ్చారు.