
ఇక ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 5.77 లక్షలకు పైగా వ్యూస్ అలాగే 18 వేలకు పైగా లైక్‌లు సాధించింది. ఇక ఈ వీడియోకు నెటిజన్స్ నుంచి అధిక స్పందన లభించింది.నిజంగా ఈ క్యూట్ పాండాలను చూస్తుంటే మనకు కూడా బీచ్ కో లేక నది దగ్గరకో వెళ్లి ఇలా కూల్ గా రిలాక్స్ అవుతూ ఆదుకోవాలనిపిస్తుంది.ఇక పాండా వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందుతాయి.అలాగే ఇలాంటి క్లిప్ నెటిజన్లను ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు.గతంలో కూడా ఇలానే ఓ పాండా జంట మంచులో రిలాక్స్ అవుతూ ఆనందించే మరొక వీడియో ఇంటర్నెట్‌లో అప్పుడు వైరల్ అయ్యింది.
వాషింగ్టన్ డీసీ లోని స్మిత్సోనియన్ నేషనల్ జూ & కన్జర్వేషన్ బయాలజీ ఇన్స్టిట్యూట్ ట్విట్టర్‌లో పంచుకున్న 51 సెకన్ల క్లిప్‌లో రెండు పాండాలు స్లైడింగ్, మంచు మీద పడ్డాయి. ఒక పాండా జూ వెనుక మంచు మార్గం వెనుకకు జారడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.ఇక ఆ వీడియో ప్రస్తుతం మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 1.8 లక్షల లైక్‌లతో పాటు 11.6 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
https://twitter.com/AnimalsWorId/status/1401094248133316609?s=19