కరోనా మహమ్మారి కల్లోలం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరు ఉద్యోగస్తులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. రంగాలతో సంబంధం లేకుండా కాలు కదపలేని పరిస్థితికి మహమ్మారి తీసుకువచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ విధానంతో మొదట్లో కాస్తంత.. ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత అలవాటు చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా కొంత మంది ఉద్యోగస్తులు తప్పకుండా తోటి ఉద్యోగస్తులతో సమావేశం కావాల్సిన అవసరం ఏర్పడటంతో... దాని కోసం గూగుల్ మీట్, జూమ్ వంటి వాటిని ఆశ్రయించారు. కాగా.. ఈ ఆన్ లైన్ మీటింగులలో కొంతమంది వ్యక్తులు చేసిన చేష్టలు నవ్విస్తున్నాయి.


ఓ మహిళ చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ.. అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే... జెమ్ అనే మహిళ.. విధి నిర్వహణలో భాగంగా లాక్ డౌన్ సమయంలో 15 నెలల కాలంలో 264 ఆన్ లైన్ మీటింగులకు అటెండ్ అయింది. కాగా ఈ 264 మీటింగులకు సదరు మహిళ.. ఒకే చొక్కా వేసుకుంది. ఈ విషయాన్ని తన కొలీగ్స్ ఎవరూ గుర్తు పట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందని జెమ్.. వ్యాఖ్యానించింది. 15నెలల పాటు మీటింగుల్లో ఒకే రకమైన చొక్కా ధరించడం పై ఆ మహిళ మాట్లాడుతూ... ఎవరైనా ఈ విషయాన్ని గుర్తు పడతారని ఎదురు చూసినట్లు, కానీ.. ఎవరు కూడా ఈ విషయం గుర్తు పట్టకపోవడంతో నిరాశ చెందినట్లు పేర్కొన్నారు.



చివరికి తనే కొలీగ్స్ తో ఈ విషయం చెప్పినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ మహిళే.. స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. ఆమె పోస్ట్ చేసిన వీడియో.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఒకే చొక్కాతో 264 మీటింగులకు హాజరు కావడం... ఆ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడం విచిత్రంగా ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: