కొండ చిలువలు ఎంత ప్రమాదకరమైన జసంతువులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటికి కనుక బాగా ఆకలి వేస్తే చాలు ఎదురుగా ఉంది ఎంత పెద్ద ప్రాణి అయినా లేదా ఎంత పెద్ద జంతువు అయినా సరే అమాంతం మింగి  అరిగించేసుకుంటాయి కొండచిలువలు. ఇక నీటిలో ఉండే ముసలి అడవికి రాజైన సింహాన్నైనా చాలా ఈజీగా వేటాడేస్తుంది .ఇక  ఈ రెండు కూడా భూమ్మీద వుండే ప్రమాదకర జీవులే. బలం విషయంలో కూడా ఇవి రెండూ కూడా తమకు తామే సాటి. ఇక ఇలాంటి రెండు ప్రమాదకర జీవులు ఒకదానికి ఒకటి ఎదురైతే సీన్ ఎలా ఉంటుంది అన్నది అత్యంత ఆసక్తికర విషయం. అయితే అలాంటి దృశ్యం ఇప్పుడు ఇక్కడ కెమెరా కంటికి చిక్కింది. వివరాల్లోకి వెళితే..ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లోని ఈసా అనే పర్వత ప్రాంతంలో పర్యటిస్తున్న టైంలో కయకెర్ మార్టిన్ అనే వ్యక్తి ఓ నదీ తీరంలో మొసలి, కొండ చిలువలు పోట్లాడుకుంటున్న ఫోటోలు తన కెమెరాతో తీశాడు.

ఇక ఆ ఫోటోలను గమనిస్తే అక్కడ కొండచిలువ ఆ మొసలిని కదలకుండా అమాంతం చుట్టేసింది.ఇక అక్కడ నీరు కూడా పెద్దగా లేకపోవడంతో మొసలి దెబ్బకి ఈ పోటీలో చేతులెత్తేసింది. దీంతో ఆ కొండచిలువ దాన్ని అమాంతంగా మింగేసింది.ఇక ఈ అలుపెరగని పోరాటంలో గెలిచిన కొండచిలువ అలవోకగా ఆ మొసలిని తన ఆహారంగా మలుచుకుంది. ఇక పాపం ఆ మొసలి తన ప్రాణాలను రక్షించుకోడానికి ఎంత ప్రయత్నించినా కాని ఆ కొండచిలువ పట్టు ముందు దాని ప్రయత్నం అస్సలు సాధ్యం అవ్వలేదు.ఇక దీంతో కొండచిలువ ఆ ముసలిని పూర్తిగా మింగేసి దర్జాగా వెళ్లిపోయింది.ఇక ఈ ఫొటోలను ‘సీజీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ’ సంస్థ తమ ఫేస్‌బుక్ పేజీలో 2019లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక అనూహ్యంగా ఆ ఫోటోలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఒళ్లు గగుర్పాటు కలిగించే ఆ దృశ్యాలను మరోసారి మీరు చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: