ఢిల్లీలో ఒక విచిత్ర‌మైన ఘ‌టన చోటుచేసుకున్న‌ది. ప్రీతీ అనే ఫ్యాష‌న్ డిజైనింగ్ చ‌దువుతున్న విద్యార్థినికి వింత అనుభ‌వం ఎదురైన‌ది. జ‌న్‌పిక్ నుంచి ఆమె నోయిడా వ‌ర‌కు మెట్రో ద్వారా ప్ర‌యాణిస్తుంది. ఈ ప్ర‌యాణానికి ఆమెకు స‌మ‌య‌మెక్కువ ప‌డుతుండ‌డంతో స్కూటీ కావాల‌ని ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌ను కోరింది. చివ‌ర‌కు గ‌త నవంబ‌ర్ నెల‌లో 3వ తేదీన త‌న పుట్టిన రోజున సంద‌ర్భంగా తల్లిదండ్రుల వ‌ద్ద నుంచి స్కూటీని బ‌హుమ‌తిని అందుకుంది. నూత‌నంగా స్కూటీ కొనుక్కొని బ‌య‌ట తిరుగుతున్న ఆయువ‌తికి స్కూటీతోనే పెద్ద స‌మ‌స్య ఎదురవుతుంద‌ని ఊహించ‌నే లేదు.

ఆ స్కూటీకి సంబంధించిన నెంబ‌ర్ ప్లేట్ మీద sex అనే అక్ష‌రాలు ఉండ‌డంతో ఆమె షాక్‌కు గురైంది. తొలుత నెంబ‌ర్ ప్లేట్ కేటాయించిన‌ప్పుడు ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌నే లేదు. ఆమె స్కూటీకి నెంబ‌ర్ ప్లేట్ వ‌చ్చిన కొద్ది రోజుల నుంచి తన స్నేహితులు హేళ‌న చేయ‌డం మొద‌లు పెట్టారు. ఢిల్లీకి చెందిన ఆ యువ‌తి ఎప్పుడైతే రిజిస్ట్రేష‌న్ చేయించుకుందో అప్ప‌టినుంచే అస‌లు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. రిజిస్ట్రేష‌న్ ఆఫీస్ వ‌ద్ద‌కు వెళ్లి ఫార్మాల్టీ ప్ర‌కారం మొత్తం పూర్తి చేసుకుని ఆ యువ‌తి త‌న ఇంటికొచ్చింది. రోడ్డు ట్రాన్స్‌ఫోర్టు అధికారులు ఆ యువ‌తి స్కూటీకి సంబంధించి నెంబ‌ర్ కేటాయించారు.

స‌ద‌రు యువ‌తికి కేటాయించిన నెంబ‌ర్ ప్లేట్‌లో సంఖ్య‌ల మ‌ధ్య‌న ఎస్ఈఎక్స్ అనే అక్ష‌రాలు ఉండ‌డంతో ఆ అక్ష‌రాలు ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయ‌ని ప్రీతి అనే యువ‌తి ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. సాధార‌ణంగా బైకు నెంబ‌ర్ ప్లేట్‌పై నెంబ‌ర్ తో పాటు ఆ వాహ‌నం ఏరాష్ట్రానికి, ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి చెందిన సూచిస్తూ ఇంగ్లీషులో అక్ష‌రాలు కూడా ఉంటాయ‌ని ప్రతీ ఒక్క‌రికీ. అదేమాదిరిగా ఆ యువ‌తికి వ‌చ్చిన నెంబ‌ర్ ప్లేట్‌పై `DL3 SEX` అనే అక్ష‌రాలున్నాయి. ఆ అక్ష‌రాలు ఆమెకు ఊహించ‌ని విధంగా ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టాయి. స్కూటీ మీద ప‌దాల‌ను చూసి తొలుత ఎగ‌తాలి చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఆ త‌రువాత ప‌దాల‌ను చూసి ఇరుగు పొరుగు వారు ఆ యువ‌తిని ఏడిపించ‌డం మొద‌లెట్టారు. కొంద‌రూ దీనిని ఫోటో తీసి సోష‌ల్ మీడియాఓ పోస్ట్ చేయ‌డంతో ఆ నెంబ‌ర్ ప్లేట్  ఇప్పుడు ఎంతో వైర‌ల్ గా మారింది.  ఆ యువ‌తికి అవ‌మానం ఇంకా ఎక్కువైంది. ఆ అవ‌మానాన్ని త‌ట్టుకోలేక ఆ యువ‌తి స్కూటీపై తిర‌గ‌డం మానేసింది. ఆర్‌టీఓ కార్యాల‌యాన్ని ఆమె తండ్రి సంద‌ర్శించాడు. త‌మ‌కు కేటాయించిన నెంబ‌ర్ ద్వారా చాలా ఇబ్బందులు ఎద‌ర‌వుతున్నాయ‌ని, త‌మ నెంబ‌ర్ ను మార్చాల‌ని కోరారు. ఇలా ఢిల్లీలో ఈ సిరీస్‌కు సంబందించి మొత్తం ప‌దివేల వాహ‌నాల‌కు సంబంధించి నెంబ‌ర్ ప్లేట్ కేటాయించామ‌ని ఈ విష‌యం పెద్ద విష‌యం కాదు అని ఓ అధికారి వెల్ల‌డించారు.

ఈ నెంబ‌ర్ ప్లేట్ మార్చ‌డం మాత్రం అసలు కుద‌రని తేల్చేసారు. ఢిల్లీలో వాహ‌నాల‌కు కేటాయించే నెంబ‌ర్లు అన్నీ డీఎల్ తో ప్రారంభ‌మ‌వుతున్నాయ‌ని, సంబంధిత జిల్లాను బ‌ట్టి కేటాయించే నెంబ‌ర్‌, వాహ‌నానికి ఇచ్చే సింగిల్ లెట‌ర్‌, రెండ‌క్ష‌రాల లేటెస్ట్ సిరిస్‌, నాలుగంకెలు ఇవ‌న్నీ వ‌రుస క్ర‌మంలోనే ఉంటాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు DL 2 C AD 1234 నెంబ‌ర్‌లో 2 అనే నెంబ‌ర్ తూర్పు జిల్లాను సూచిస్తొంద‌ని, సీ అంటే కారు. ఏడీ అనేది నెంబ‌ర్ సిరిస్‌.. అదే ద్విచ‌క్ర వాహ‌నం అయితే సీ లెట‌ర్ స్థానంఓ ఎస్ అనే లెట‌ర్ ఉంటుంద‌ని దాని త‌రువాత వ‌చ్చే EX అనే లెటర్స్‌ ఉండటం ఇప్పుడు ఢిల్లీలో చాలా మంది ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం అని త‌మ దృష్టికి తీసుకొస్తున్నార‌ని అధికారులు వెల్ల‌డిస్తున్నారు. ఆర్డీఓ అధికారులు ఆ నెంబ‌ర్ ప్లేట్‌కు సంబంధించిన సిరీస్‌ను ఒక్క‌రికీ మార్చితే అంద‌రికీ మార్చాల్సి వ‌స్తుంద‌ని.. ఇలా మార్చ‌డం కుద‌ర‌దు అని చెప్ప‌డంతో ఆ సిరిస్ కలిగిన వాహ‌దారులంద‌రికీ తిప్ప‌లు త‌ప్పేలా లేవు.





మరింత సమాచారం తెలుసుకోండి: