ఈ మధ్య ఫుడ్ కు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతూన్నాయి. అవి కొంతమందికి ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి కొంతమందికి విరక్తి కలిగిస్తున్నాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. మొన్నటి వరకూ పానిపూరిని వివిధ రకాలుగా చేసిన కొందరు వ్యక్తులు.. దాని తర్వాత మ్యాగీ తో కూడా వింత వంటలు చేశారు. ఇప్పుడు వెజ్ తో ఫిష్ చేశారు. వెజ్ తో ఫిష్ ఏంటీ? అని ఆలోచిస్తున్నారా? అవునండి బాబూ.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ ఫిష్ ఫ్రై నిజంగా బాగుందని అంటున్నారు.


ఇదెందిరా అయ్యా ఇలాంటిది విచిత్రం.. వెజ్ ఫిష్ ఫ్రై.. వినడానికి ఆశ్చర్యంగా వుంది.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఢిల్లీ లో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఒక ఫుడ్ జాయింట్ వారి మెనూలో సరి కొత్త ఐటమ్‌ను యాడ్ చేశారు. అదే ఈ వెజ్ ఫిష్ ఫ్రై.. ఇది ఆ ప్రాంతంలో పరిచయం అయిన కొత్త వంట కావడంతో చుట్టూ పక్కల ఉన్న వారంతా అక్కడకు వచ్చి ఆ వెరైటీ వంటను ట్రై చెస్తున్నారు. అందులో భాగంగా ఓ ఫుడ్ బ్లాగర్ వ్యక్తి అక్కడకు వెళ్లారు.


శాఖాహార చేపల వేపుడును ఢిల్లీలోని ఖన్నా తందూరి జంక్షన్ తయారు చేస్తోంది. ఈ కొత్త వంటను ఢిల్లీ లోని ఓ తందూరి జంక్షన్ తయారు చేస్తోంది. ఈ వంటకు ఎక్కువగా సోయాబీన్, అల్లం వెల్లుల్లి పేస్ట్‌. వాటి ద్వారా చేప ఆకారాన్ని చేసి.. నూనేలో ఫ్రై చేస్తున్న సన్నివేశాలను ఈ వీడియోలో చూడండి.. అది మొత్తం చూడటానికి చేప ఆకారంలో ఉంటుంది.. టెస్ట్ కూడా అలానే వుంటుందని అందరూ అంటున్నారు. చూడగానే తినాలనిపించె ఈ వంటకు పెద్దగా పేరు రాలేదు.. వెజ్ తో ఫిష్ ఏంటీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ ఫిష్ ఫ్రై వీడియోను మీరు కూడా చూడండి. మీకు ఎలా అనిపించిందొ కామెంట్ చేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: