ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ల వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక క్షణంపాటు అరచేతిలో మొబైల్ లేకుండా ఉండే మనిషి నేటి రోజుల్లో  కనిపించడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో అయితే పక్కన ఎవరూ లేక పోయినా పర్వాలేదు చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు అదేస్నేహితుడు అని అనుకుంటున్నారు నేటి రోజులలో జనాలు.  ఎక్కడా బోర్ కొట్టకుండా సెల్ ఫోన్ లోనే కాలం గడుపుతూ జర్నీ లు చేస్తున్న వారు కూడా లేకపోలేదు.



 మరి ఇంతలా మొబైల్ వాడిన తర్వాత అందులో ఛార్జింగ్ ఉంటుందా తుస్సు మంటు వెళ్ళిపోతుంది. ఇక అలాంటి సమయంలో ఎంతో మంది దూర ప్రయాణాలకు వెళ్తున్న ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తమ వెంట పవర్ బ్యాంకు తీసుకెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. తద్వారా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అంటే పవర్ బ్యాంకు ద్వారా మళ్లీ ఛార్జ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు మొబైల్ తో పాటు పవర్ బ్యాంకు వాడకం కూడా ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.. ఇక వివిధ స్థాయిలలో మార్కెట్లో పవర్ బ్యాంకు లు అందుబాటులో ఉన్నాయి.


 ప్రస్తుతం అందరూ ఉపయోగిస్తున్న పవర్ బ్యాంకు ల కెపాసిటీ చూసుకుంటే దాదాపు ఒక్కో పవర్ బ్యాంక్ నుంచి 4 మొబైల్స్ లేదా 5 మొబైల్స్ వరకు కూడా ఛార్జ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5000 మొబైల్స్ ఛార్జ్ చేయగల సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంకు గురించి ఎప్పుడైనా మీరు విన్నారా.. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది దాని గురించి 2.7 కోట్ల ఎంఏహెచ్  సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్ ఇక్కడ ఒక వ్యక్తి తయారు చేశాడు. ఇక ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద పవర్ బ్యాంకు కావడం గమనార్హం


 చైనాకు చెందిన టెక్ నిపుణుడు ఇక ఈ అద్భుతమైన పవర్ బ్యాంకు ని తయారు చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ ఉన్న హ్యాండి జాగ్  అనే టెక్ నిపుణుడు  ఈ పవర్ బ్యాంక్ తయారు చేశాడు. ఈ పవర్ బ్యాంకు ద్వారా 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యమున్న 5000 స్మార్ట్ ఫో స్ ఛార్జ్ చేయొచ్చు అని చెబుతున్నాడు. ఇక ఈ భారీ పవర్ బ్యాంకు లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా మొత్తంగా 60 పోర్ట్స్ కూడా ఉండడం గమనార్హం.  మొబైల్స్ మాత్రమే కాదు టీవీ వాషింగ్ మెషిన్ కూడా పవర్ బ్యాంకు ని ఉపయోగించి వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదండోయ్ ఎలక్ట్రికల్ స్కూటర్ లకు కూడా ఈ పవర్ బ్యాంకుతో ఛార్జ్ చేయవచ్చు. అంతా బాగానే ఉంది కానీ పవర్ బ్యాంకు వెంట తీసుకెళ్లడం మాత్రం సులువు కాదండోయ్. ఇక ఈ పవర్ బ్యాంకు మోయడానికి బాహుబలి లాంటి అవతారం ఎత్తవలసి ఉంటుంది..  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారిపోతు ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: