జీవితం అంటేనే ఒక మిస్టరీ. ఇక జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది మాత్రం ఊహించని విధంగానే ఉంటుంది. కేవలం మనుషుల జీవితంలోనే కాదు జంతువులు పక్షులు జీవితాల్లో సైతం ఎన్నో అనుకోని ఘటనలు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు వాటిల్లో ఉన్న ధైర్యం బలం ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇలా విపత్తులు ఎదురైనపుడు లోపల దాగి ఉన్న ధైర్యం బయటకు వస్తుంది అన్నదానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనంగా మారిపోయింది. సాధారణంగా మన ముందు ఎవరైనా మన కంటే 100 రెట్లు ఎక్కువ బలవంతుడైన శత్రువు ఉంటే ఎవరైనా సరే భయపడిపోతుంటారు.


 అటు జంతువులు కూడా అంతే బలమైన జంతువు ముందు ఉంటే ఇక ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉంటాయి.  కానీ ఇక్కడ ఒక పక్షి మాత్రం ధైర్యసాహసాలు ప్రదర్శించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది చూసిన తర్వాత ఎంతటి విపత్తును అయినా సరే అలవోకగా జయించవచ్చు అన్నది అర్ధమవుతుంది. ఒక పక్షి ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీనిని పోస్ట్ చేసింది ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.


 సైజు ఎంత ఉంటే నేమ్ ధైర్యం ఉంటే చాలు.. ఈ వీడియో నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు ఆయన.. చుట్టూ ఆవులమంద ఉంది.. ఇక ఆ ఆవులు మొత్తం మధ్యలో ఉన్న పక్షిని ఎంతో కోపంగా చూస్తున్నాయి. తర్వాత అన్ని ఆవులు ఆ పక్షి పై దాడి చేయడానికి పరుగులు పెడుతూ వచ్చాయ్. కానీ ఎక్కడ భయపడలేదు ఆ పక్షి. సాయశక్తులా ఆవులను భయపెట్టడానికి ప్రయత్నించింది. దీంతో దాడి చేయడానికి వచ్చిన ఆవులు కూడా భయపడి అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. ఇక ఇలా బాతు ఒంటరిగా ఆవుల తో పోరాటం చేస్తున్న తీరు.. క జీవిత సత్యాన్ని బోధిస్తుంది అని ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు. తన కంటే 100 రెట్లు బలమైన పెద్దదైన ఆవులతో చిన్న బాతు పోరాటం మాత్రం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంది అని అంటున్నారు ఎంతో మంది నెటిజన్లు..

మరింత సమాచారం తెలుసుకోండి: