మాములుగా బట్టలను బాల్కనీలో ఆరవేయడం చేస్తారు. పల్లెల్లో అయిన పట్టణాలలొ అయిన అలానే బట్టలను ఆర వేస్తారు..అయితే అలా వెయ్యడం నేరమని అంటున్నారు.అదేంటి అనుకుంటూన్నారా? అవును అండీ మీరు విన్నది అక్షరాల నిజం. ఇకపై బాల్కనీ లో దుస్తులు ఆరేస్తే భారీగా ఫైన్ పడనుంది.ఇది ఈ మధ్య అమల్లోకి వచ్చిందని అంటున్నారు. ఇలాంటివి మనకు అయితే లేవు. మరి ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దము..


ఈ వింత శిక్షలు అనేవి అరబ్ కంట్రీలలో ఉన్నాయి.వింతైన రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. అక్కడ బాల్కనీ లో బట్టలు ఆరబెట్టడం పై హెచ్చరికలు జారీ చేసింది. అబుదాబి అధికారులు అపార్ట్‌మెంట్ బాల్కనీలు, కిటికీలు లేదా రెయిలింగ్‌ల పై దుస్తులను ఆర బెట్టడాన్ని నిషేధించారు. బాల్కనీ లో బట్టలు ఆరేయడం వల్ల నగర అందం దిగజారి పోతోందని అంటున్నారు. ఇటువంటి పరిస్థితి లో ప్రజలు అబుదాబి అందాల ను కాపాడుకోవాలని సూచించారు.. ఎవరైనా అలా బాల్కనీ లో బట్టలు ఆరెస్తూ దొరికితే మాత్రం భారీ ముల్యాన్ని చెంచుకోవాలి.1000 దిర్హామ్‌లు అంటే మన కరెన్సీలో అక్షరాల 20000 వేలకు చెల్లించాలి.


ఈ విషయం పై అవగాహన కల్పించాలని ప్రచార కార్యక్రమాల ను కూడా నిర్వహించారు. అబుదాబి మునిసిపల్ కార్పొరేషన్ ఈ ప్రచారం చేపట్టింది. నగరం అందంగా ఉండేలా చూసుకోవడమే లక్ష్యంగా పేర్కొంటుంది. అపార్ట్‌మెంట్ బాల్కనీలో లాండ్రీని ఉంచడం లేదా వాటిని కిటికీకి వేలాడదీయడం వంటివి చేస్తె ఇల్ల గోడలు పాడై పోతాయని అంటున్నారు. బాల్కనీని దుర్వినియోగం చేసినట్లు తేలితే, వారికి 1000 దిర్హామ్‌ల కంటే ఎక్కువ జరిమానా విధించనున్నారు. అబుదాబి మున్సిపల్ కార్పొరేషన్ బట్టలు ఉతకడానికి అత్యాధునిక లాండ్రీ-డ్రైయింగ్ టెక్నాలజీ ని ఉపయోగించాలని ప్రజలకు సూచించింది. ఎలక్ట్రానిక్ బట్టలు డ్రైయర్లు, బట్టలు ఆర బెట్టేందుకు ర్యాక్‌లు ఉపయోగించాల ని కోరింది.వీధిలో కనిపించేలా వెయ్యొద్దని హెచ్చరించ వద్దని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: