ఇక ఎలాంటి విష పూరితమైన కీటకం అయినా సరే కప్ప నోటిలోకి వెళ్ళింది అంటే చాలు చివరికి ఆహారంగా మారి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎప్పటి లాగానే కప్ప తనదైన శైలిలో నాలుక తో ఒక చిన్న కీటకాన్ని లోపలికి లాగింది. కానీ ఆ తర్వాతే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఏకంగా కప్ప కడుపులో నుంచి ఆ చిన్న పురుగు వెలుగులు విరజిమ్మడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే.. మినుగురు పురుగులు ఎంతలా వెలుగులు విరుజిమ్ము తుంటాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఇలా మినుగురు పురుగులు వెలుగులు విరజిముతున్న సమయం లో అక్కడికి వచ్చిన ఒక కప్ప లటుక్కున ఒక మిణుగూరు పురుగును మింగేసి కడుపు లో దాచుకుంది. ఇలాంటి సమయం లోనే ఇక ఆ కప్ప కడుపులో ఉన్న మినుగురు పురుగు మళ్లీ వెలుగులు విరజిమడం మొదలుపెట్టింది. ఇక ఈ వెలుగులు ఏకంగా బయటికి కూడా కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లోకి వైరల్ గా మారిపోవడంతో ఇది చూస్తున్న ఎంతోమంది అవాక్కవుతున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి