ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా అత్యున్నత పదవిలో కొత్త వ్యక్తి ఎవరు రాబోతున్నారు అనే చర్చ మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్లో ఎంతలా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఐసీసీ చైర్మన్ కాబోతున్నారు అంటూ ఎంతో మంది పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇలా సోషల్ మీడియాలో తెరమీదకి వచ్చిన పేర్లలో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ పేరు కూడా ఉండడం గమనార్హం. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరబ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ కావడం పక్కా అంటూ అభిమానులు అందరూ కూడా భావించారు.



 అయితే సౌరబ్ గంగూలీకి ఐసీసీ చైర్మన్ అయ్యేందుకు అర్హతలు ఉన్నప్పటికీ అటు బీసీసీఐ పెద్దలనుంచి మాత్రం ఇక గంగూలికి సరైన మద్దతు లేకపోవడంతో చివరికి ఐసీసీ చైర్మన్ రేసు నుంచి సౌరబ్ గంగూలీ తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా గ్రేట్ బార్క్లే బాధ్యతలు చేపట్టాడు. అధ్యక్ష పదవి కోసం బార్క్లే మినహా ఎవరు బరిలో లేకపోవడంతో ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరిగింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఐసీసీ చైర్మన్ మాత్రమే కాదు డిప్యూటీ చైర్మన్ కూడా మరోసారి ఇక ఇంతకుముందు ఉన్న వ్యక్తి ఎంపిక కావడం గమనార్హం.


 ఇమ్రాన్ ఖవాజా మరోసారి ఐసీసీ డిప్యూటీ చైర్మన్ గా ఎంపికయ్యారు. అయితే ఖవాజా రెండేళ్ల పాటు ఇక ఇలా డిప్యూటీ పదవిలో కొనసాగారు అని చెప్పాలి. అలాగే అసోసియేట్ మెంబర్ డైరెక్టర్ గాను వ్యవహరిస్తున్నారు ఆయన. 2008లో ఐసీసీ బోర్డు లోకి వచ్చిన ఖవాజా 2017 నుంచి డిప్యూటీ చైర్మన్ పదవి బాధ్యతలను చేపడుతున్నారు. ఇకపోతే ఎంతో అనుభవం ఉన్న ఖవాజాను మరోసారి డిప్యూటీ చైర్మన్ గా నియమిస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైశా ఐసీసీ ఆర్థిక వాణిజ్య అఫైర్స్ కమిటీ సభ్యుడుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా ఐసీసీ పురుషుల కమిటీ అధినేతగా ప్రస్తుతం సౌరబ్ గంగూలీ వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: