జనావాసాలు క్రమక్రమంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మనిషి తన స్వార్థం కోసం అడవులను నరికేస్తూ పెద్దపెద్ద భవనాలను నిర్మించుకుంటున్నాడు. దీంతో అడవులనే ఆవాసాలుగా జీవించే జంతువులకి చివరికి ఇళ్ళే లేకుండా పోతుంది  దీంతో మనుషులు అడవులు నరికేస్తూ ఉండడంతో.. ఇక అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనాభాసాల్లోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే మనుషులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో కోతుల బెడద లేని గ్రామం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 కేవలం గ్రామాల్లోనేనా అటు పట్టణాల్లో కూడా ఈ కోతుల బెడద కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఏకంగా మనుషులపైన కోతులు దాడి చేస్తున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని ఉలికిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల రాజస్థాన్లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా రెండు కోతులు మహిళపై దారుణంగా దాడికి పాల్పడ్డాయి. అజ్మీర్ జిల్లాలో రామ్ నగర్ కాలనీలో ఉంటున్న ఒక మహిళ తన ఇంటి పెరట్లో కుర్చీ వేసుకుని కూర్చుంది. హాయిగా సేద తీరుతుంది.


 అయితే అప్పటికే ఆ ప్రాంతంలో కోతుల మంద తిరుగుతుంది. ఈ క్రమంలోనే రెండు కోతులు ఏకంగా మహిళలు టార్గెట్ చేసి దాడికి పాల్పడ్డాయి. మహిళ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా.. ఒక కోతి ఆమె ఇంటి గోడ పైకి ఎక్కి ఏకంగా మహిళ జుట్టు పట్టుకుని లాగింది. ఇక ఏం జరుగుతుందో తన జుట్టును ఎవరు లాగుతున్నారు అర్థం కాక.. మహిళ టెన్షన్ పడింది. ఇంతలో రెండో కోతి వచ్చి ఆమె జుట్టును పట్టుకుని బలంగా లాగడం మొదలు పెట్టింది. దీంతో కోతులను గమనించిన ఆమె పెద్దగా కేకలు వేయడంతో.. ఇంట్లో ఉన్నవారు వచ్చి కోతులను అక్కడి నుంచి తరిమేసారు.  ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: