
రుతుపవనాల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది .. అలాగే రానున్న మూడు రోజుల్లో రాష్ట్రమంతటా మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు .. ఇదే క్రమంలో ఈరోజు నుంచి సోమవారం వరకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది .. అలాగే . కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ తెలుగుపాటి వర్షాలు పడే అవకాశం ఉంది ..
అలాగే తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది .. అలాగే పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది .. ఇదే క్రమంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు భారీగా కురుస్తాయిన వాతావరణ కేంద్రం చెప్పకు వస్తుంది .. అలాగే గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పుకు వస్తుంది..